ప‌వ‌న్ పై సెటైర్లు వేసిన టీడీపీ ఎంపీ

ప‌వ‌న్ పై సెటైర్లు వేసిన టీడీపీ ఎంపీ
x
Highlights

జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ కల్యాణ్ పై టీడీపీ ఎంపీ గ‌ల్లాజ‌య్ దేవ్ సెటైర్లు వేశారు. గ‌త ఎన్నిక‌ల్లో త‌మను గెలిపించింది ప‌వ‌న్ క‌ల్యాణే అని టీడీపీ -...

జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ కల్యాణ్ పై టీడీపీ ఎంపీ గ‌ల్లాజ‌య్ దేవ్ సెటైర్లు వేశారు. గ‌త ఎన్నిక‌ల్లో త‌మను గెలిపించింది ప‌వ‌న్ క‌ల్యాణే అని టీడీపీ - బీజేపీ నేత‌లు చెప్పిన సంద‌ర్భాలు ఉన్నాయి. అయితే కొద్దిరోజుక్రితం ప‌వ‌న్ క‌ల్యాణ్ పోల‌వ‌రం సంద‌ర్శించి టీడీపీ ఎంపీల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. కొంత‌మంది ఎంపీలు పోల‌వ‌రాన్ని గాలికొదిలేసి - వ్యాపారాలు చూసుకుంటున్నార‌ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌పై కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు పవన్ ఎవరో తనకు తెలీదంటూ వ్యాఖ్యానించారు. దీనిపై ప‌వ‌న్ కూడా ఇన్ డైర‌క్ట్ గా సెటైరికల్ గా కామెంట్ చేయ‌డంతో రంగంలోకి దిగిన చంద్ర‌బాబు ప‌వ‌న్ క‌ల్యాణ్ పై ఎవ‌రు అనుచిత వ్యాఖ్య‌లు చేయోద్ద‌ని సూచించారు. తాజాగా ప‌వ‌న్ వ్యాఖ్యలకు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడిన ఆయ‌న కొంతమంది వ్యాపారం చేసి ప్రజా ప్రతినిధులవుతుంటారని - ఇంకొంతమంది ప్రజా ప్రతినిధులుగా మారిన తర్వాత వ్యాపారాలు చేస్తుంటారని జయదేవ్ అన్నారు. పోరాటం చేయ‌డానికి త‌మ‌చేతులు క‌ట్టేశార‌ని ఒక్క‌రి వ‌దిలి చూడండి మా స‌త్తా ఏంటో చూపిస్తాం. అయినా ఎంపీలందరం కలిసి పార్లమెంట్ లో వెల్ లోకి వెళ్లి నినాదాలు చేశామని ప్లకార్డులు చూపామని గుర్తు చేశారు. తాము ప్రజలకు అందుబాటులోనే ఉన్నామని కొంతమంది గిట్టనివారు తమపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. మరి గల్లా నర్మగర్భంగా పవన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు పవన్ స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories