పార్ల‌మెంట్ లో గ‌ర్జించిన గ‌ల్లా

పార్ల‌మెంట్ లో గ‌ర్జించిన గ‌ల్లా
x
Highlights

గల్లా జయదేవ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు..Mr.ప్రైమ్ మినిస్టర్ అంటూ నిండు సభలో కోట్లాది మనది భారతీయులు చూస్తూ ఉండగానే పీఎం మోడీ ఒక్కసారి...


గల్లా జయదేవ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు..Mr.ప్రైమ్ మినిస్టర్ అంటూ నిండు సభలో కోట్లాది మనది భారతీయులు చూస్తూ ఉండగానే పీఎం మోడీ ఒక్కసారి ఉలిక్కిపడేలా గర్జించారుఈ గుంటూరు ఎంపీ..సినీనటుడు కృష్ణ కి అల్లుడు..హీరో మహేష్ కి బావ అయిన గల్లా జగదేవ్ మోడీ పై చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా భారతదేశం మొత్తంగా సంచలనం అయ్యారు..ఏపీ ప్రజలకైతే హీరో అయ్యారు..అప్పటి స్పీచ్ లో మోడీ ని కేందాన్ని దూది ఏకినట్టు ఏకేసిన గల్లా మళ్ళీ ఈరోజు తన గళం విప్పారు..నిరసన సెగలు ఒక పక్క పుట్టిస్తూనే డ్రామాలు ఆడుతోంది కేంద్రం అంటూ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు..ఇంతకీ అసలేమి జరిగింది అంటే..
రెండు రోజులుగా పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా అడ్డుకుంటున్న టీఆర్ఎస్ మరియు అన్నాడీఎంకే ఎంపీలు ఈరోజు కూడా అదే సీన్ రిపీట్ చేశారు..అవిస్వాసం పై చర్చలు జరిగిన తరువాత వారి సమస్యల మీద డిమాండ్ చేయచ్చు కదా అంటూ టిడిపి ఎంపీలు చెపుతున్నా సరే వినిపించుకునే పరిస్థితి లేదు..అంతేకాదు ఇన్నిరోజుల నుంచి ఏపీ ఎంపీలు ఆందోళన చేస్తున్నా ప్రధాని మోదీ నుంచి స్పందనే లేదని మండిపడ్డారు. ఏపీ ప్రజలకు మోదీ ఇంత ద్రోహం చేస్తాడని కలలో కూడా ఊహించలేదని టీడీపీ ఎంపీలు చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ అప్పుడు ఇప్పుడు బీజేపి ఇద్దరు ఎపీకి అన్యాయం చేస్తున్నారని..టీఆర్‌ఎస్, అన్నాడీఎంకే ఎంపీలతో మాట్లాడేందుకు మోదీకి ఏం ఇబ్బందని..ప్రశ్నించారు గల్లా. ఎన్డీయే, అన్నాడీఎంకే లు కలిసి మ్యాచ్ ఫిక్స్ చేస్తున్నాయని అన్నారు..కేంద్రానికి ఎపీని చుసినా, తెలుగుదేశం ఎంపీలని చూసినా సరే బయమని అందుకే పారి పోతున్నారని ఎద్దేవా చేశారు..ఏపీలో ప్రతీ పౌరుడు ఇక్కడి పరిస్థితులని గమనిస్తున్నారని తప్పకుండా ప్ర‌జ‌లు బుద్ది చెప్తారని గల్లా కేంద్రపై విరుచుకు పడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories