ప‌వ‌న్ బేస్ లెస్ లీడర్..ఆయ‌న గురించి మాట్లాడుకోవ‌డం వేస్ట్

ప‌వ‌న్ బేస్ లెస్ లీడర్..ఆయ‌న గురించి మాట్లాడుకోవ‌డం వేస్ట్
x
Highlights

టీడీపీ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై సెటైర్లు వేశారు. ప‌వ‌న్ బేస్ లెస్ లీడ‌ర్ అని ఎద్దేవా చేశారు. జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్...

టీడీపీ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై సెటైర్లు వేశారు. ప‌వ‌న్ బేస్ లెస్ లీడ‌ర్ అని ఎద్దేవా చేశారు. జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ దెబ్బ‌తో ఏపీ అధికార ప‌క్షం టీడీపీ ల‌బోదిబోమంటోంది. 2014లో టీడీపీకి మ‌ద్ద‌తు పలికిన ప‌వ‌న్ నిన్న జ‌రిగిన జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో విమ‌ర్శ‌లు చేయ‌డం ఆ పార్టీకి కోలుకోలేని షాక్ త‌గిలింది.
గ‌తంలో స‌భ‌లు నిర్వ‌హించిన ప‌వ‌న్ టీడీపీ వ్య‌తిరేకంగా మాట్లాడిన దాఖ‌లాలు లేవు. కానీ టీడీపీ అవినీతి మార్క్ పాల‌నతో విసుగెత్తిపోయిన జ‌న‌సేనాని తెలుగు త‌మ్ముళ్లను టార్గెట్ చేస్తూ ఏపీలో కొత్త‌రాజ‌కీయానికి తెర‌తీశారు.
గుంటూరు స‌భ‌లో ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ ఉద్దేశిస్తూ విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ‌గుడిలోని పార్కింగ్ స్థ‌లంలో వ‌సూల‌య్యే మొత్తంలో ఎమ్మెల్యేల‌కు కొంత శాతం వాటా చెల్లించేంత‌గా చివ‌ర‌కు అమ్మ‌వారిని కూడా దోచేస్తారా..? అని మండిప‌డ్డారు.
అయితే ఈ వ్యాఖ్య‌ల‌పై బీకాంలో ఫిజిక్స్ ఉంటుంద‌నే వ్యాఖ్య‌ల‌తో బాగా పాపుల‌ర్ అయిన ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ మండిప‌డ్డారు. దుర్గ‌గుడి పార్కింగ్ వ‌ద్ద తాను డ‌బ్బ‌లు వ‌సూలు చేసిన‌ట్లు ప‌వ‌న్ ఆరోపిస్తున్నార‌ని అన్నారు. ప‌వ‌న్ చేసిన ఆరోప‌ణ‌లు నిజ‌మైతే నేను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని ఆయ‌న స‌వాల్ విసిరారు. ఈసంద‌ర్భంగా బీజేపీ వ‌ద్ద ప్యాకేజీ తీసుకొని ప‌వ‌న్ టీడీపీని టార్గెట్ చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు.
ప‌వ‌న్ స‌భ పెడుతున్నారంటే ఏపీకి ప్ర‌త్యేక‌హోదా గురించి మాట్లాడతారని అనుకున్నా. కానీ ఇవ‌న్నీ మానేసి మాపై ఆరోప‌ణ‌లు చేయ‌డం త‌గ‌ద‌ని జ‌లీల్ ఖాన్ అన్నారు.
తాజాగా ఏపీ వక్ఫ్ బోర్డ్ నూతన ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన జలీల్ ఖాన్ త్వరలో కబ్జా వివరాలు అంతేగాక, ఏపీ వక్ఫ్ బోర్డుకు తమిళనాడు తరహా జ్యుడీషియల్ అధికారాన్ని ఇవ్వాలని, బోర్డు అభివృద్ధి కోసం రూ. 100కోట్లు అవసరమని చెప్పారు. ప్రస్తుతం వక్ఫ్ బోర్డు ఆస్తులు ఎన్ని ఉన్నాయో బయటకి తీసుకొస్తామని, బోర్డు ఆస్తులను కబ్జా చేసిన వారి వివరాలను త్వరలోనే బయటపెడతామని అన్నారు. ఈ సంద‌ర్భంగా కేంద్రం ఏపీకి అన్యాయం చేస్తుందంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇక ప‌వ‌న్ గురించి మాట్లాడటమంటే సమయాన్ని వృథా చేసుకోవడమేనని అన్నారు. అతనో బేస్ లెస్ లీడర్ అని ఎద్దేవా చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories