జగన్ కి టీడీపీ ఎమ్మెల్యే సవాల్

జగన్ కి టీడీపీ ఎమ్మెల్యే సవాల్
x
Highlights

పాయకరావుపేట నియోజకవర్గ కోటవురట్లలో వైసీపీ అధినేత జగన్ చేసిన ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్యే అనిత మండిపడ్డారు. ఈ ఆరోపణలపై జగన్ బహిరంగ చర్చకు సిద్ధమా? అని...

పాయకరావుపేట నియోజకవర్గ కోటవురట్లలో వైసీపీ అధినేత జగన్ చేసిన ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్యే అనిత మండిపడ్డారు. ఈ ఆరోపణలపై జగన్ బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి పాయకరావు పేట నియోజకవర్గ కోటవురట్లలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. అధికార పార్టీపై పలు ఆరోపణలు చేశారు. కాగా..దీనిపై మంగళవారం ఎమ్మెల్యే అనిత మీడియాతో మాట్లాడారు. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తున్నట్లు అవినీతి పరులకు అవునీతి తప్ప రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కనపడడంలేదని విమర్శించారు. లేని పోనీ ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని ఆమె అన్నారు. జగన్‌కు ఫ్లెక్సీలు కట్టిన వారే ఇసుక మాఫీయాలో పెద్ద దొంగలని విమర్శించారు. ఈ విషయం తాము చెప్పడం కాదని.. వారిపై కేసులు కూడ ఉన్నాయని అనిత అన్నారు. జగన్‌కు సీఎం కూర్చీ తప్ప ఇంకేమీ అవసరం లేదని.. ఇలా అయితే జగన్ ఎప్పటికి సీఎం కాలేరని ఆమె అన్నారు. రాజకీయాల్లోకి కుటుంబాలను లాగడం సరికాదని, రాజకీయాల కోసం కుటుంబాలని వాడు కుంది జగనేనని అనిత తీవ్రస్థాయిలో విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories