టీడీపీకి రామారెడ్డి రాజీనామా..

టీడీపీకి రామారెడ్డి రాజీనామా..
x
Highlights

టీడీపీకి మరో కీలక రాజీనామా చేశారు. ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం విషయంలో సీఎం చంద్రబాబునాయుడు సరైన రీతిలో...

టీడీపీకి మరో కీలక రాజీనామా చేశారు. ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం విషయంలో సీఎం చంద్రబాబునాయుడు సరైన రీతిలో స్పందించలేదని తద్వారా తాను మనస్థాపం చెందానని తూర్పు గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆ పార్టీ లీగల్‌సెల్‌ ఉపాధ్యక్షుడు మేడపాటి రామారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు తీరుతో పార్టీ పట్ల పెంచుకున్న నమ్మకం నిర్వీర్యం అయిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. మంగళవారం ఆయన తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా పంపారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పై ఉన్న అభిమానంతో టీడీపీలో చేరానని.. మానవత్వం ఉన్న ఎవ్వరైనా జగన్‌పై జరిగిన హత్యాయత్నాన్ని ఖండించాల్సిందేనన్నారు. ఎవరికైనా కష్టం వస్తే శత్రువునైనా పలుకరించి అధైర్యపడవద్దని భరోసా ఇవ్వడం కనీస ధర్మం. ఇందుకు విరుద్ధంగా టీడీపీ ప్రవర్తిస్తోందని అయన అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories