ఆ టీడీపీ నేత వ్యాఖ్యలు బ్రహ్మానందం కామెడీలా ఉన్నాయి : జూపూడి

ఆ టీడీపీ నేత వ్యాఖ్యలు బ్రహ్మానందం కామెడీలా ఉన్నాయి : జూపూడి
x
Highlights

అక్టోబర్ 25న విశాఖ ఎయిర్పోర్టులో వైసీపీ అధినేత జగన్ పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో జగన్ భుజానికి గాయమవ్వగా ప్రస్తుతం అయన...

అక్టోబర్ 25న విశాఖ ఎయిర్పోర్టులో వైసీపీ అధినేత జగన్ పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో జగన్ భుజానికి గాయమవ్వగా ప్రస్తుతం అయన కోలుకుంటున్నారు. ఇదిలావుంటే ఈ దాడి నేపథ్యంలో టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. జగన్‌పై ఆయన తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిలలే హత్యాయత్నం చేయించారంటూ టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు ఆ పార్టీ సీనియర్ నేత జూపూడి ప్రభాకరరావు. రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు అతడి విజ్ఞతకే వదిలివేస్తున్నామని జూపూడి అన్నారు. సినిమా సీరియస్‌గా సాగుతుంటే మధ్యలో బ్రహ్మానందం కామెడీ మాదిరిగా ఆయన వ్యాఖ్యలు చేసినట్టున్నారని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పని.. టీడీపీ కూడా ఆయన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోలేదని తెలిపారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నం టీ కప్పులో తుఫాన్‌లాంటి సంఘటనగా పోల్చుతూ ఏమీ లేని చోట గవర్నర్‌.. డీజీపీని నివేదిక కోరడం ఏంటని జూపూడి ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories