ఎమ్మెల్యేలు, ముఖ‌్యనేతలకు చంద్రబాబు స్ట్రాంగ్‌ క్లాస్

x
Highlights

టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం హాట్‌హాట్‌గా జరిగింది. ఎమ్మెల్యేలు, ముఖ‌్యనేతలకు చంద్రబాబు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. చిన్నపిల్లలకు చెప్పినట్లు...

టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం హాట్‌హాట్‌గా జరిగింది. ఎమ్మెల్యేలు, ముఖ‌్యనేతలకు చంద్రబాబు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. చిన్నపిల్లలకు చెప్పినట్లు చెబుతున్నా సీరియస్‌‌నెస్‌ లేకపోతే ఎలా అంటూ అసహనం వ్యక్తంచేశారు. ఓవర్ కాన్ఫిడెన్స్ మంచిది కాదంటూ క్లాస్ పీకిన చంద్రబాబు కేసీఆర్ సహా పలు అంశాలపై కీలక కామెంట్స్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌‌ ఫెడరల్‌ టూర్‌‌పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో కీలక మార్పులు రానున్నాయన్న చంద్రబాబు అందరినీ గందరగోళ పర్చేందుకే‌ కేసీఆర్‌‌ ఆయా రాష్ట్రాల పర్యటనకు వెళ్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌‌ రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తామంటున్నారని, ఆయన ఏపీ రాజకీయాల్లోకి వస్తే సంతోషమేనన్నారు. ఇక ఈవీఎంలపై అనుమానాలు పెరుగుతున్నాయన్న చంద్రబాబు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్ల కంటే కౌంటింగ్‌లో ఎక్కువ ఎలా వచ్చాయోనంటూ సందేహాలు వ్యక్తంచేశారు.

ఇక పార్టీ సభ్యత్వ నమోదుపై నియోజకవర్గ ఇన్‌‌ఛార్జులకు చంద్రబాబు స్ట్రాంగ్‌ క్లాస్ పీకారు. సభ్యత్వ నమోదు మందకొడిగా సాగడంపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ప్రజల్లో చులకన అవుతారనే ఊరుకుంటున్నానని, కానీ తిట్టకపోతే మితిమీరి ప్రవర్తిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. కొందరు చేస్తోన్న తప్పులతో పార్టీ పరువు పోతుందని సీరియస్‌ అయ్యారు. మొత్తానికి టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం హాట్‌హాట్‌గా జరిగింది. ఎమ్మెల్యేలు, ముఖ‌్యనేతలకు చంద్రబాబు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. రాబోయే 6 నెలలు అత్యంత కీలకమన్న చంద్రబాబు సీరియస్‌నెస్‌ లేని లీడర్ల విషయంలో కఠినంగా ఉంటానంటూ హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories