టీడీపీ టీమ్ ఇదే

x
Highlights

టీడీపీ పొలిట్‌బ్యూరో స్థానాలు ఖాళీ అయ్యాయి. వీరి స్థానంలో కొత్తగా ఇద్దరికి అవకాశం కల్పించారు. పార్టీ పొలిట్‌బ్యూరోలో మొత్తం 17 మందిని చంద్రబాబు...

టీడీపీ పొలిట్‌బ్యూరో స్థానాలు ఖాళీ అయ్యాయి. వీరి స్థానంలో కొత్తగా ఇద్దరికి అవకాశం కల్పించారు. పార్టీ పొలిట్‌బ్యూరోలో మొత్తం 17 మందిని చంద్రబాబు నియమించారు. ఆంధ్రప్రదేశ్ పార్టీ కమిటీలో 105 మంది, తెలంగాణ కమిటీలో 114 మందికి చోటు కల్పించారు. సమావేశానంతరం చంద్రబాబు మీడియాకు వివరాలు వెల్లడించారు. తెలంగాణ నుంచి కొత్తగా రేవూరి ప్రకాశ్‌రెడ్డి, సీతక్కకు పొలిట్‌బ్యూరోలో చోటు కల్పించినట్టు చెప్పారు. పొలిట్ బ్యూరోలో ఉన్నవారిలో అందరూ సీనియర్లే గనుక పెద్దగా మార్పులు చేయలేదని చెప్పారు. తెలంగాణ పార్టీ కమిటీకి ఎల్.రమణ అధ్యక్షుడిగా, రేవంత్‌రెడ్డి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతారని వెల్లడించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కమిటీకి అధ్యక్షుడిగా కళా వెంకట్రావు ఉంటారని తెలిపారు. త్వరలోనే పార్టీ అనుబంధ సంఘాలు, కమిటీలు ప్రకటించనున్నట్టు సీఎం వెల్లడించారు.

కొత్త పొలిట్‌బ్యూరో ఇదే..
నారా చంద్రబాబు నాయుడు, అశోక్‌గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, కేఈ కష్ణమూర్తి, హరికృష్ణ, కాల్వ శ్రీనివాసులు, దేవేందర్‌గౌడ్, ఉమా మాధవరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ప్రతిభా భారతి, అయ్యన్నపాత్రుడు, నామా నాగేశ్వరరావు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, సీతక్క

తెలంగాణ రాష్ట్ర కమిటీ
అధ్యక్షుడు ఎల్. రమణ (జగిత్యాల్), కార్యనిర్వహకాధ్యక్షుడు రేవంత్ రెడ్డి (మహబూబ్ నగర్), రాష్ట్ర ఉపాద్యక్షులు ఈలేటి అన్నపూర్ణమ్మ (నిజామాబాద్), వంగాల స్వామిగౌడ్ (సూర్యాపేట), చందా సురేష్‌రెడ్డి (వరంగల్ అర్బన్), రమావత్ లక్ష్మణ్ నాయక్ (హైదరాబాద్), ఎం.అవుర్‌నాథ్ బాబు (నిజామాబాద్), అలీ మస్కతి (హైదరాబాద్), బట్టి జగతి (వెుదక్), పాల్వాయి రజిని కుమారి (సూర్యాపేట), సామా భూపాల్‌రెడ్డి (రంగారెడ్డి), మద్దినేని బేబి స్వర్ణకుమారి (ఖమ్మం), రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అరికల నర్సారెడ్డి (నిజామాబాద్), వేం నరేందర్‌రెడ్డి (వరంగల్ అర్బన్ ), గుల్లపల్లి బుచ్చిలింగం (ఆసిఫాబాద్ కొమురం భీం), ఈగ మల్లేశం (వరంగల్ అర్బన్), బోల్లం మల్లయ్య యాదవ్ (సూర్యాపేట), డి. శ్రీశైలం (సంగారెడ్డి), అట్లూరి రమాదేవి (నిజామాబాద్), లంకల దీపక్‌రెడ్డి (హైదరాబాద్), అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి (యాదాద్రి భువనగిరి), రాజారాం యాదవ్ (నిజామాబాద్) కార్యదర్శి కందికంటి ఆశోక్ గౌడ్, ప్రచార కార్యదర్శి బొబ్బాల రమణా రెడ్డి.

ఆంధ్రప్రదేశ్ కమిటీ
అధ్యక్షుడు కళా వెంకట్రావు (శ్రీకాకుళం), ఉపాధ్యక్షులు కాగిత వెంకట్రావు(కృష్ణా), పి. రామ సుబ్బారెడ్డి (కడప), ముత్తంశెట్టి శ్రీనివాసరావు (విశాఖపట్నం), ఎన్.పి. వెంకటేశ్వర చౌదరి (చిత్తూరు), గొల్లపల్లి సూర్యారావు (తూర్పుగోదావరి), తాళ్లపాక అనురాధ (నెల్లూరు), డాక్టర్ ఎస్.ఎం.డి నౌమాన్ (కర్నూలు), రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వర్ల రావుయ్య (కృష్ణా), పయ్యావుల కేశవ్ (అనంతపూర్), బి.వి. జయనాగేశ్వర్ రెడ్డి (కర్నూలు), కొత్తపల్లి సుబ్బారా యుడు (పశ్చిమ గోదావరి), పల్లా శ్రీనివాసరావు (విశాఖపట్నం), ఆనం రామనారాయణ రెడ్డి (నెల్లూరు), అధికార ప్రతినిధులు జూ పూడి ప్రభాకరరావు (ప్రకాశం), వై.వి.బి రాజేంద్రప్రసాద్ (కృష్ణా).

టీడీపీ సెంట్రల్ కమిటీ సభ్యులు
ఉపాధ్యక్షులు... కొనకళ్ల నారాయణ రావు (కృష్ణా), డి.కె సత్యప్రభ (చిత్తూరు), గరికపాటి రామ్మోహన్ రావు (వరంగల్), మాగుంట శ్రీనివాసులు రెడ్డి (ప్రకాశం), సండ్ర వెంకటవీరయ్య (ఖమ్మం), ప్రధాన కార్యదర్శులు నారా లోకేష్ (చిత్తూరు), ఇ.పెద్దిరెడ్డి (కరీంనగర్), ఎం.ఏ. షరీఫ్ (పశ్చిమ గోదావరి), కింజరాపు రామ్మోహన్ నాయుడు (శ్రీకాకుళం), కోశాధికారి.. సిద్దా రాఘవరావు (ప్రకాశం), అధికార ప్రతినిధులు సీఎం రమేష్ (కడప), కంభంపాటి రామ్మోహన రావు (కృష్ణా), కొత్తకోట దయాకర్ రెడ్డి (మహబూబ్‌నగర్), గల్లా జయుదేవ్ (గుంటూరు), అరవింద్ కుమార్ గౌడ్ (హైదరాబాద్), మీడియా కమిటి కన్వీనర్ ఎల్.వి.ఎస్.ఆర్.కే ప్రసాద్ (కృష్ణా).

హరికృష్ణ సేఫ్
నటుడు నందమూరి హరికృష్ణ స్థానం టీడీపీలో పదిలంగా ఉంది. ఆయన ప్రస్తుతం టీడీపీ పొలిట్ బ్యూరోలో కొనసాగుతున్నారు. శనివారం కొత్తగా ఏర్పడిన పొలిట్‌బ్యూరోలో కూడా ఆయనను కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలకు, నేతలకు కొన్ని సూచనలు చేశారు. క్రమశిక్షణగా ఉండాలని, మీడియాతో ఏది పడితే అది మాట్లాడకుండా ప్రజలతో మమేకమై వారి అభివృద్ధికి కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. పదవుల ద్వారా పార్టీలో గుర్తింపు లభిస్తుందని, ఆ గుర్తింపును ఉపయోగించుకుని ప్రజలకు, పార్టీకి మేలు కలిగేలా చూడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories