టీకాంగ్రెస్‌లో రేవంత్ వ్యాఖ్యల ప్రకంపనలు

టీకాంగ్రెస్‌లో రేవంత్ వ్యాఖ్యల ప్రకంపనలు
x
Highlights

రేవంత్ రెడ్డి పదవుల కోసం ఓపికగా ఎదురు చూడాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి హితవు పలికారు. కాంగ్రెస్‌లోకి నిన్నా మొన్నా వచ్చిన...


రేవంత్ రెడ్డి పదవుల కోసం ఓపికగా ఎదురు చూడాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి హితవు పలికారు. కాంగ్రెస్‌లోకి నిన్నా మొన్నా వచ్చిన రేవంత్.. కీలక పదవుల కోరడం ఎంతవరకు సబబని విలేకరులతో చిట్ ఛాట్‌గా వ్యాఖ్యానించారు. కీలక పదవి ఇస్తామంటూ రేవంత్ రెడ్డి‌కి రాహుల్ దూతలు హామీ ఇచ్చారనేది కరెక్ట్ కాదన్నారు. ఎవరు ఎంతటి నాయకులో ప్రజలతో పాటు పార్టీ గుర్తిస్తుందని కానీ ఎవరికి వారే గొప్పలు చెప్పుకోవడం సరికాదన్నారు....పొంగులేటి సుధాకర్ రెడ్డి. పార్టీలో కొంతమందిని కించపరిచేలాగా రేవంత్ రెడ్డి మాట్లాడటం సరికాదన్నారు. అసలు తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడని పొంగులేటి ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో ఇటీవలి పరిణామాలపై పార్టీ కోర్ మీటింగ్ లో చర్చిస్తామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories