భలే మంచి.. కారు బేరమూ..!

భలే మంచి.. కారు బేరమూ..!
x
Highlights

మంచి తరుణం మించిన దొరకదు.. రండి బాబూ రండి.. ఆలస్యం అమృతం విషం.. అంటూ ఫోర్ వీలర్ సంస్థలు జనాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం చివరి...

మంచి తరుణం మించిన దొరకదు.. రండి బాబూ రండి.. ఆలస్యం అమృతం విషం.. అంటూ ఫోర్ వీలర్ సంస్థలు జనాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం చివరి నెల కావడంతో.. ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తూ.. అమ్మకాలను పెంచుకునేందుకు ఆరాటపడుతున్నాయి. ఇందులో.. టాటా సంస్థ.. కారు మోడల్ ఆధారంగా లక్ష రూపాయల వరకూ డిస్కౌంట్ అందిస్తోంది. నెక్సన్ మోడల్ తప్ప.. ఇతర అన్ని మోడల్స్ పై ఒక్క రూపాయికే ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా అందిస్తూ.. జనాన్ని రా రమ్మని ఆహ్వానిస్తోంది.

ఫ్రాన్స్ సంస్థ డస్టర్ కూడా రెనో కారు ధరను లక్ష రూపాయలు తగ్గించేసింది. క్విడ్ మోడల్స్ కు నాలుగేళ్ల వారంటీని ఇవ్వడమే కాదు.. 7.99 శాతానికి వడ్డీపై లోన్లు కూడా అందిస్తోంది. ఒక్క రూపాయికే ఇన్సూరెన్స్ కూడా ఇచ్చేస్తోంది. టార్గెట్ అంతా.. సేల్స్ పెంచుకోవడమే.

జర్మనీ సంస్థ ఫోక్స్ వాగన్ కూడా.. వెంటో మోడల్ పై లక్షా ఇరవై వేల రూపాయల ప్రయోజనాలు అందిస్తోంది. ఇందులో 25 వేల రూపాయల డిస్కౌంట్ కూడా ఓ భాగం. అమియో, పోలో లాంటి ఇతర మోడల్స్ కూ ఇలాగే డిస్కౌంట్లు, ఇతర ప్రయోజనాలు అందిస్తూ జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇండియన్ మార్కెట్ లో టాప్ రేంజ్ లో ఉన్న మారుతి మాత్రం.. తక్కువగా డిస్కౌంట్స్ ఇస్తోంది. ఒక్క వాగన్ ఆర్ పై 30 వేల డిస్కౌంట్.. 35 వేల ఎక్స్చేంజ్ బోనస్ అందిస్తోంది. ఇతర సంస్థలు కూడా.. టార్గెట్ చేరుకునేందుకు.. రకరకాల ఆఫర్లు.. లోన్లు అందిస్తూ.. జనాన్ని తెగ ఊరించేస్తున్నాయి. చూద్దాం.. ఈ ఆఫర్లు ఎంత వరకూ వర్కవుట్ అవుతాయో!

Show Full Article
Print Article
Next Story
More Stories