జైలవకుశలో తమన్నా స్పెషల్ సాంగ్ లుక్

తెలుగు ఐటమ్ సాంగ్స్‌లో ఒకప్పుడు ఉత్తరాది భామలు ఆడిపాడేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. స్పెషల్ సాంగ్స్ కోసం ...
తెలుగు ఐటమ్ సాంగ్స్‌లో ఒకప్పుడు ఉత్తరాది భామలు ఆడిపాడేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. స్పెషల్ సాంగ్స్ కోసం వాళ్లనో, వీళ్లనో దింపడం ఎందుకనే భావనకు దర్శకనిర్మాతలొచ్చారు. సినిమాకు ఏ మాత్రం సంబంధం లేని మరో హీరోయిన్‌తో స్టెప్పులేయించడం ఈ మధ్య టాలీవుడ్‌లో కనిపిస్తున్న సీన్. ఇప్పుడు ఇదే సీన్ జైలవకుశ సినిమాలో రిపీట్ కాబోతోంది. జైలవకుశ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్ చేయబోతోంది. ఈ పాటను చిత్ర యూనిట్ ఆడియోతో పాటు విడుదల చేయలేదు. ఇవాళ సాయంత్రం 5.40 నిమిషాలకు పాటను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ, ఈ పాటలో తమన్నా ఎలా ఉండబోతోందో ఒక పోస్టర్‌తో చెప్పకనే చెప్పేశారు. తమన్నా పాటకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్ ఈ సాంగ్‌పై అంచనాలను మరింత పెంచింది.
ఎన్టీఆర్ మూడు పాత్రల్లో మెప్పించడమే ఒక పండగగా భావించిన ఫ్యాన్స్ ఇప్పుడు తమన్నాను చూసి ఉబ్బితబ్బిబవుతున్నారు. స్వింగ్ జరా అంటూ సాగే ఈ పాటలో తమన్నా చిందేయనుంది. దేవీశ్రీ ప్రసాద్ స్పెషల్ సాంగ్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తమన్నా స్పెషల్ సాంగ్‌లో మెప్పించడం కొత్తేమీ కాదు. అల్లుడు శీను సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్‌తో కలిసి స్టెప్పులేసింది. ఇప్పుడు తారక్‌తో కలిసి స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతోంది. ఎన్టీఆర్, తమన్నా కాంబినేషన్లో వచ్చిన ఊసరవెల్లిలో దాండియా సాంగ్ కూడా దాదాపు ఐటమ్ సాంగ్‌లానే ఉంటుంది. ఎన్టీఆర్ కూడా జనతా గ్యారేజ్‌లో కాజల్‌తో పాటు డ్యాన్స్ చేసి మెప్పించిన సంగతి తెలిసిందే.
పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT
రేవంత్ 'రెడ్డి' పాలిటిక్స్ తిరగబడ్డాయా?
24 May 2022 4:00 PM GMTHealth: ఈ ఆహారాలు కాలేయానికి హానికరం.. అస్సలు తినొద్దు..!
24 May 2022 3:30 PM GMTప్రేమ వివాహం.. అక్కను పెళ్లి చేసుకున్నాడని బావ చెవి కొరికేసిన...
24 May 2022 3:10 PM GMTకుమారుడి కోసం ఒక్కటైన పవన్, రేణు దేశాయ్.. ?
24 May 2022 3:00 PM GMTFenugreek Seeds: పెళ్లైన పురుషులు కచ్చితంగా మెంతులని తినాలి.....
24 May 2022 2:45 PM GMT