త‌మ‌న్నా క్వీన్ అవ‌తారం..

త‌మ‌న్నా క్వీన్ అవ‌తారం..
x
Highlights

త‌మ‌న్నా క్వీన్ పాత్ర‌లో క‌నిపించ‌నుందా? అవున‌నే వినిపిస్తోంది టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో. అలాగ‌ని.. యుద్ధాలు చేసే రాణి పాత్ర అనుకుంటే పొర‌పాటే. బాలీవుడ్...

త‌మ‌న్నా క్వీన్ పాత్ర‌లో క‌నిపించ‌నుందా? అవున‌నే వినిపిస్తోంది టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో. అలాగ‌ని.. యుద్ధాలు చేసే రాణి పాత్ర అనుకుంటే పొర‌పాటే. బాలీవుడ్ లో ఘ‌న‌విజ‌యం సాధించిన సోష‌ల్ మూవీ 'క్వీన్' ఆధారంగా రూపొందుతున్న తెలుగు రీమేక్‌లో త‌మ‌న్నా న‌టించ‌నుంది. కంగనా ర‌నౌత్ హీరోయిన్‌గా న‌టించిన 'క్వీన్' నాలుగేళ్ల క్రింద‌ట విడుద‌లైంది. ఇక‌ గ‌త రెండేళ్లుగా ఈ సినిమాని రీమేక్ చేయాల‌ని ద‌క్షిణాదిలో ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఈ మ‌ధ్యే క‌న్న‌డ‌ వెర్ష‌న్ షూటింగ్ కి వెళ్ల‌గా.. త‌మిళంలో కాజ‌ల్‌తో అనౌన్స్ అయ్యింది. ఇక తెలుగులో ఆ పాత్ర‌కి త‌మ‌న్నా పేరు వినిపిస్తోంది. మ‌ల‌యాళంలో ఈ రీమేక్ గురించి ఎలాంటి అప్‌డేట్ లేదు. తెలుగు వెర్ష‌న్ కి 'మిస్స‌మ్మ' ఫేమ్ నీల‌కంఠ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నార‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తివివ‌రాలు అధికారికంగా వెల్ల‌డ‌య్యే అవ‌కాశ‌ముంది.

Show Full Article
Print Article
Next Story
More Stories