బ‌స్సు యాత్ర వాయిదా..?

బ‌స్సు యాత్ర వాయిదా..?
x
Highlights

ప్రధాన ప్రతిపక్షంలో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. ఉత్తమ్ కుమార్ అధిష్టానాన్ని ఒప్పించి బస్సుయాత్రకు తేదీలు ఖరారు చేసుకుంటే.. సీనియర్లంతా...

ప్రధాన ప్రతిపక్షంలో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. ఉత్తమ్ కుమార్ అధిష్టానాన్ని ఒప్పించి బస్సుయాత్రకు తేదీలు ఖరారు చేసుకుంటే.. సీనియర్లంతా మూకుమ్మడిగా విభేదించి, ఖరారైన తేదీలు మళ్లీ వాయిదా పడే పరిస్థితికి తీసుకొచ్చారు. ఎవరితో చర్చించకుండా బస్సుయాత్ర ఎలా చేస్తారని పార్టీ సీనియర్లంతా వ్యతిరేకించడంతో ఆ యాత్ర తేదీలు మరోసారి అయోమయంలో పడ్డాయి.

పార్లమెంటుతో పాటు రాష్ట్ర అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వస్తాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకు తగినట్టుగానే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. అధికారపార్టీ కంటే ముందుగానే ప్రజల్లో ఉండే విదంగా ప్లాన్ చేసుకుంటోంది. అయితే ముందుగా పాదయాత్ర చేయాలని ప్లాన్ చేసినా... అధిష్టానం అంగీకరించకపోవడంతో బస్సు యాత్ర ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ప్రకటించారు.

అధిష్టానంతో చర్చించి ఈ నెల 26 నుంచి బస్సుయాత్ర చేయాలని పీసీసీ చీఫ్ ఉత్తం తేదీలు ఖరారు చేసుకున్నారు. పార్టీ ముఖ్యనేతలు ఉత్తం, భట్టి, జానారెడ్డి, డి.కే అరుణ, రేవంత్ రెడ్డి బస్సులో పర్యటించే విధంగా అనుమతి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఉత్తం సీనియర్లకు సమాచారం అందించడంతో వారంతా మూకుమ్మడిగా ఇప్పుడే బస్సుయాత్ర అవసరమా అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు గ్రామస్థాయి కమిటీలు పూర్తికాలేదు దీనికి తోడు పిసిసి కొత్త కమిటీలు కూడా పూర్తి కానందున బస్సుయాత్ర ఎలా చేస్తారని నిలదీసినట్లు తెలుస్తోంది. దీనికితోడు నియోజకవర్గం ఇంచార్జులును కూడా ప్రకటించకుండా బస్సుయాత్రకు వెళ్లడం తొందరపాటే అవుతుందని కొందరు ఉత్తంకు చెప్పినట్లు సమాచారం. ఎవరితో చర్చించకుండా బస్సుయాత్రకు తేదీలు ఎలా ఖరారు చేస్తారని డికే, దామోదర లాంటి నేతలు అభ్యంరతం వ్యక్తం చేసినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.

నియోజకవర్గాల ఇంచార్జులను ప్రకటించి బస్సు యాత్రకు వెళితే సంబంధిత ఇంచార్జ్ జనసమీకరణ చేసి బస్సుయాత్రను విజయం వంతం చేస్తారని పార్టీ నేతులు సూచించినట్లు సమాచారం. వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాలు ఉన్నందున అవి పూర్తి కాగానే ప్రభుత్వం చేసే కేటాయింపులు తెలుస్తాయి కాబట్టి పూర్తి స్థాయి కసరత్తు చేసి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మంచి స్పందని వస్తుందని కొందరు అభ్యంతరాలు చెప్పనట్తు తెలుస్తోంది. దీంతో నేతలందరినీ దారికి తెచ్చుకునేందుకు చాలా రోజులుగా గాంధీభవన్ కు దూరంగా ఉంటున్నవారి ఇంటికి సైతం ఉత్తం వెళ్లి బుజ్జగించినట్లు తెలుస్తోంది.

ఇక పార్టీల్లో చేరికలు జోరుగానే జరిగినా వారికి స్థానిక సీనియర్లే అడ్డు తగులుతున్నారు. రేవంత్ వెంట టీడీపీ నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నా వారికి సీనియర్లు లైన్ క్లీయర్ చేయడం లేదు. వారు వస్తే... తమ వారికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల ఇబ్బంది ఉంటుందని వారు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఆ నేతలంతా లైన్ క్లియర్ చేయకపోవడం వల్ల చాలా మంది నేతలు ఇంకా టీటీడీపీలో ఉంటూ కాంగ్రెస్ క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. అధిష్టానం రెండు టిక్కెట్లు ఇచ్చే పరిస్థితి లేదని తేల్చడంతో త్వరలో పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి ద్వారా టీటీడీపీ నుంచి దయాకర్ రెడ్డి, సీతా దయాకర్ రెడ్డి, బీజేపీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. మాజి ఎమ్మెల్సీ కాసాని జ్ణానేశ్వర్ సైతం త్వరలో కాంగ్రస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం.

రాష్ట్రంలో టిఆర్ఎస్ ను ఢీకొట్టడానికి కాంగ్రెస్ మాత్రమే సరైందని ఇతర పార్టీల నేతలు కూడా భావిస్తున్నారు. ప్రధానంగా ఇటీవల టీటీడీపీలో మిగిలి ఉన్న నేతలు సైతం కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో సొంతగూటిని ఎంత త్వరగా టీ-కాంగ్రెస్ నేతలు చక్కదిద్దుకుంటారనేదే కీలకంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories