'సైరా'.. రెగ్యులర్ షూటింగ్ అప్పట్నుంచే

'ఖైదీ నెం.150'తో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు తన 151వ చిత్రాన్ని స్వాతంత్ర్య...
'ఖైదీ నెం.150'తో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు తన 151వ చిత్రాన్ని స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా చేస్తున్నారు. 'సైరా నరసింహారెడ్డి' పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రం గత నెల లాంఛనంగా ప్రారంభమయ్యింది. అలాగే చిరు పుట్టినరోజున ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. సంగీత దర్శకుడు థమన్ నేపథ్య సంగీతంతో వచ్చిన ఈ మోషన్ పోస్టర్ అభిమానుల్ని అలరించింది.
అమితాబ్ బచ్చన్, నయనతార, జగపతిబాబు, విజయ్ సేతుపతి, సుదీప్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతమందించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ని వచ్చే నెల 20న ప్రారంభించనున్నారని తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నానక్‌రామ్ గూడ స్టూడియోలో ఆర్ట్‌డైరెక్టర్ రాజీవన్ నేతృత్వంలో ఓ భారీ సెట్‌ని నిర్మిస్తున్నారు. అక్కడే ఈ రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని టాక్ వినిపిస్తోంది. 'ఖైదీ నెం.150'ని నిర్మించిన కథానాయకుడు రామ్‌చరణ్‌నే ఈ సినిమాకి కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సురేందర్ రెడ్డి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
వాహనదారులకు భారీ ఊరట.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన కేంద్రం
21 May 2022 1:34 PM GMTప్రధాని సంచలన నిర్ణయం.. అదృష్టం కోసం తన పుట్టిన రోజు మార్పు..
21 May 2022 1:30 PM GMT26 మందికి కరోనా.. 13వేల మంది క్వారంటైన్..
21 May 2022 1:00 PM GMTయమునోత్రి వెళ్లే దారిలో కూలిన రక్షణ గోడ.. రోడ్డుపైనే చిక్కుకున్న 10వేల ...
21 May 2022 12:45 PM GMTRevanth Reddy: జయశంకర్ పేరు కాలగర్భంలో కలపాలని సీఎం చూస్తున్నారు..
21 May 2022 12:23 PM GMT