కిడ్నీ ఫెయిల్యూర్ అయితే.. సంకేతాలు ఇవి!

కిడ్నీ ఫెయిల్యూర్ అయితే.. సంకేతాలు ఇవి!
x
Highlights

శరీరంలోని మలినాలను బయటకు పంపడంలో కిడ్నీలది కీలకపాత్ర. రక్తాన్ని శుద్ధి చేయడం ద్వారా మూత్రపిండాలు ఒంట్లో పేరుకుపోయిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు బయటకు...

శరీరంలోని మలినాలను బయటకు పంపడంలో కిడ్నీలది కీలకపాత్ర. రక్తాన్ని శుద్ధి చేయడం ద్వారా మూత్రపిండాలు ఒంట్లో పేరుకుపోయిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపుతాయి. బీపీ, ఎలక్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తాయి. కానీ డయాబెటిస్, హై బీపీ లాంటి వ్యాధుల కారణంగా కిడ్నీల పనితీరు మందగిస్తుంది. కిడ్నీల పనితీరు మందగిస్తే.. శరీరం మొత్తానికి ప్రమాదం వాటిల్లుతుంది. కిడ్నీలు పూర్తిగా పాడైతే ప్రాణాలు దక్కకుండా పోతాయి. కాబట్టి ప్రాథమిక దశలోనే కిడ్నీల సమస్యను గుర్తించి సరైన చికిత్స తీసుకోవాలి.

పనితీరు మందగిస్తే వచ్చే సంకేతాలు..
మూత్రం రంగు మారినా, మూత్రంలో అసాధారణ మార్పులు కనిపించినా కిడ్నీ సమస్య ఉందని భావించాలి. కిడ్నీలు తీవ్రంగా చెడిపోతే రుచి సామర్థ్యం, ఆకలి తగ్గుతుంది. రక్తంలోని వ్యర్థాల కారణంగా వికారం, వాంతులు లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఆకలి లేకపోవడంతో బరువు తగ్గుతారు.కిడ్నీలు సరిగా పనిచేయకపోతే శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయి.. ముఖం, కాళ్లు ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. కిడ్నీల పనితీరు మందగించడం వల్ల ఎర్ర రక్తకణాల ఉత్పత్తి తగ్గుతుంది. ఆక్సిజన్ స్థాయులు తగ్గడం వల్ల శ్వాస సమస్యలు తలెత్తుతాయి. కిడ్నీలు పాడయినప్పుడు అవి ఉండే భాగంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. కిడ్నీలు చెడిపోయాయి అనడానికి ముందస్తు సూచన ఇది. ఏ విషయంపైనా ఏకాగ్రత ఉంచలేకపోవడం, తలనొప్పి, జ్ఞాపకశక్తి తగ్గడం లాంటి సమస్యలు చుట్టుముడతాయి. కాబట్టి ఏడాదికి ఒకసారి కిడ్నీల పనితీరును పరీక్షించుకోవడం ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories