logo
సినిమా

సైరాకి షాక్‌.. సెట్స్‌ కూల్చివేత

సైరాకి షాక్‌.. సెట్స్‌ కూల్చివేత
X
Highlights

మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రానికి హైదరాబాద్‌...

మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రానికి హైదరాబాద్‌ రెవెన్యూ అధికారులు షాకిచ్చారు. రామ్ చ‌రణ్ హీరోగా తెర‌కెక్కిన రంగ‌స్థ‌లం సినిమా కోసం శేరిలింగంప‌ల్లి రెవిన్యూ ప‌రిధిలో వేసిన సెట్స్‌లోనే సైరా మూవీ షూటింగ్ జ‌రుపుతున్నారు. అయితే ఇది ప్ర‌భుత్వ భూమి కావ‌డంతో చిత్ర నిర్మాత‌లు ఎలాంటి అనుమ‌తి తీసుకోకుండా య‌దేచ్చ‌గా షూటింగ్ జ‌రుపుతున్న క్ర‌మంలో రెవిన్యూ అధికారులు సైరాలో క‌థానాయ‌కుడి ఇంటి సెట్‌ని కూల్చేశారు. గ‌తంలో ప‌లు మార్లు ఆ స్థలాన్ని ఖాళీ చేయ‌మ‌ని నోటీసులు పంపిన ఫ‌లితం లేక‌పోవ‌డంతో ఇలా చేయాల్సి వ‌చ్చిందని అధికారులు అంటున్నారు. ముంద‌స్తు ప‌ర్మీష‌న్ తీసుకుంటే ఉచితంగానే షూటింగ్ చేసుకోనిచ్చేవార‌మ‌ని, కాని వారు అనుమ‌తుల్లేకుండా సెట్స్ వేసి, ఆ భూమ‌ని స్వాధీనం చేసుకొనే ప్ర‌ణాళిక వేసిన‌ట్టు తెలిసింది. అందుక‌ని సెట్స్ మొత్తాన్ని కూల్చేసిన‌ట్టు తెలిపారు. దీనిపై మూవీ నిర్మాత‌లు ఎలా స్పందిస్తారో చూడాలి.

Next Story