logo
సినిమా

మెగా సందడి షురూ...విడుదలైన చిరంజీవి ‘సైరా నరసింహా రెడ్డి’ టీజర్‌

X
Highlights

మెగా ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'సైరా' చిత్రం టీజర్ విడుదలైంది. నెట్టింట దూసుకెళుతున్న ఈ...

మెగా ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'సైరా' చిత్రం టీజర్ విడుదలైంది. నెట్టింట దూసుకెళుతున్న ఈ టీజర్ ఇప్పుడు దుమ్ము రేపుతోంది. మెగాస్టార్ బర్త్ డేకు ఒక్కరోజు ముందుగా అంటే నేటి(మంగళవారం) ఉదయం 11:30గంటలకు టీజర్‌ను వదిలింది చిత్రబృందం.అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ ఈ సినిమాను ఓ మెట్టు ఎక్కించిందనే చెప్పాలి. విజువల్ వండర్‌లా టీజర్ కనిపిస్తోంది. టీజరే ఇలా ఉందంటే సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కోటపై నిలబడిన చిరు చాలా గంభీరంగా అద్భుతమైన పోరాటపటిమతో కనిపించారు. మొత్తానికి టీజర్ చూస్తుంటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనిపిస్తోంది. మెగాస్టార్‌ తొలి స్వాతంత్ర్య సమరయోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు సురేందర్‌ రెడ్డి దర్శకుడు. చిరు తనయుడు రామ్‌ చరణ్‌ కొణిదెల ప్రొడక్షన్ కం‍పెనీ బ్యానర్‌పై దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

Next Story