స్వీట్ షాపులకు క్యూ కడుతున్న జనం

x
Highlights

వెలుగులు విరజిమ్ముతూ నట్టింట సంతోషాన్ని పంచే దీపావళి అంటే అందరికీ ఇష్టమే చిన్నా, పెద్ద అన్న తేడాలేకుండా దీపావళిని అందరూ ఉత్సాహంతో జరుపుకుంటారు. ఇక...

వెలుగులు విరజిమ్ముతూ నట్టింట సంతోషాన్ని పంచే దీపావళి అంటే అందరికీ ఇష్టమే చిన్నా, పెద్ద అన్న తేడాలేకుండా దీపావళిని అందరూ ఉత్సాహంతో జరుపుకుంటారు. ఇక దీపావళికి క్రాకర్స్ కాల్చని వాళ్లు ఉంటారేమో కానీ నోరు తీపి చేసుకోనివారు. ప్రతి ఒక్కరూ మిఠాయిలు తింటూ తియ్యని వేడుకు చేసుకుంటుంటారు దీంతో వెరైటీ స్వీట్లతో స్వీట్ షాపులు వెల్కమ్ చెబుతున్నాయి. దీపావళి వచ్చిందంటే చాలు.. దీపాల కాంతులు పటాకుల మోతలు, తారాజువ్వల జిలుగులు మతాబుల వెలుగులు చిచ్చుబుడ్డి పువ్వులు పిల్లల నవ్వులు కేరింతలతో ఇల్లంతా సందడిగా మారుతుంది. ఈ ఆనందాల పండుగను మరింత తియ్యగా జరుపుకునేందుకు స్నేహితులకు, బంధువులకు మిఠాయిలు బహుమతిగా ఇస్తూ ఆనందాన్ని పంచుకుంటారు. దీంతో హైదరాబాద్ లో క్రాకర్స్ షాప్ లతో పాటు స్వీట్ల షాపుల వద్ద సందడి మొదలైంది. ఇక పండగ సందర్భంగా మిఠాయిలు కొనుగోలు చేసేందుకు స్వీట్ షాపులకు వెళ్తున్న ప్రజలు దీనికి తగ్గట్టుగానే నగరంలోని స్వీట్ షాపులు వివిధ రకాల స్వీట్లు నోరూరిస్తున్నాయి ఈ ఒక్కరోజూ డైటింగ్ ప్లాన్ పక్కన పెట్టి స్వీట్లు లాగించేద్దాం అనిపించేలా బోల్డన్ని వెరైటీలు, కొత్త కొత్త రుచులు, వెరైటీ కలర్స్ తో స్వీట్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక స్నేహితులుకు, బంధువులకు గిఫ్ట్ గా ఇవ్వడానికి వెరైటీ డ్రై ప్రూట్స్ తో అందంగా తయారు చేసి గిఫ్ట్ ప్యాక్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.. మొత్తానికి దీపావళి పండగ రోజు నోరు తీపి చేసుకొని.. పండగను గ్రాండ్ గా జరుపుకుంటున్నారు ప్రజలు.

Show Full Article
Print Article
Next Story
More Stories