పంటపొలాల్లో వ్యక్తి దారుణ హత్య..

పంటపొలాల్లో వ్యక్తి దారుణ హత్య..
x
Highlights

పంటపొలాల్లో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఒడిశా బరంపురం సితలాపల్లి గ్రామ శివారులో జరిగింది. గ్రామానికి చెందిన ఎంకా రెడ్డి తన భార్యతో కలిసి పని...

పంటపొలాల్లో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఒడిశా బరంపురం సితలాపల్లి గ్రామ శివారులో జరిగింది. గ్రామానికి చెందిన ఎంకా రెడ్డి తన భార్యతో కలిసి పని కోసం శనివారం గోపాల్‌పూర్‌ వెళ్లాడు. అదే రోజు సాయంత్రం పని ముగించుకుని వ్యాన్‌లో ఇంటికి పయనమయ్యాడు. మార్గం మధ్యలో ఓ బైకుపై వచ్చిన యువకుడితో ఎంకారెడ్డి కలిసి వెళ్ళాడు.రాత్రి అయినా ఎంకారెడ్డి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఎంకారెడ్డికి చరవాణికి ఫోన్‌ చేశారు. ఫోన్ ఎంతకీ ఎత్తకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు సితలాపల్లి గ్రామ శివారులో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని దారుణంగా హత్య చేసి పరారయ్యారు. దీంతో మృతుడు ఎంకారెడ్డిగా గుర్తించారు. కాగా ఎంకారెడ్డి హత్యకు పాతకక్షలేనని పోలీసులు అనుమానిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories