ఎస్పీ కార్యాలయంలో హోంగార్డుల వెట్టిచాకిరి

x
Highlights

ఖాకీ ప్యాంట్‌, వైట్‌ టీషర్ట్‌ చూడగానే తెలుస్తుంది వాళ్లు పోలీసులని శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డులది కీలక పాత్ర కానీ సూర్యాపేట ఎస్పీ కార్యాలయంలో...

ఖాకీ ప్యాంట్‌, వైట్‌ టీషర్ట్‌ చూడగానే తెలుస్తుంది వాళ్లు పోలీసులని శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డులది కీలక పాత్ర కానీ సూర్యాపేట ఎస్పీ కార్యాలయంలో వీళ్లను కూలీల కంటే దారుణంగా ట్రీట్‌ చేస్తున్నారు లా అండ్‌ ఆర్డర్‌లో పాలుపంచుకోవాల్సిన హోంగార్డులతో పోలీస్‌ ఉన్నతాధికారులు వెట్టిచాకిరి చేయిస్తున్నారు.

సూర్యాపేట ఎస్పీ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న పార్కింగ్‌ భవన నిర్మాణంలో కూలీలుగా మార్చేశారు. 15రోజులుగా హోంగార్డులతో పునాదులు తవ్విస్తూ మట్టి, ఇసుక, రాళ్లు మోయిస్తున్నారు. మొత్తం 50మంది హోంగార్డులతో బలవంతంగా భవన నిర్మాణ పనులు చేయిస్తున్నారు. వీరిలో కొందరు పునాదులు తవ్వుతుంటే మరికొందరు రాళ్లు, ఇసు, మట్టి మోస్తున్నారు.

భవన నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా ఉన్నతాధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఎస్పీ మెప్పు కోసమో లేక డబ్బు ఆదా చేయాలనుకున్నారో ఏమో హోంగార్డులను బెదిరించి మరీ కూలీలుగా మార్చేశారు. అధికారులను ప్రశ్నిస్తే ఎక్కడ ఉద్యోగాలు ఊడపీకుతారోనన్న భయంతో బాధను దిగమింగుకుని 15రోజులుగా హోంగార్డులంతా వెట్టిచాకిరి చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories