Top
logo

పాల వ్యాపారంలోకి నిర్మాత.. లీటర్ పాల ధర చూస్తే షాకే..

పాల వ్యాపారంలోకి నిర్మాత.. లీటర్ పాల ధర చూస్తే షాకే..
X
Highlights

హ్యాపీ ఆవులు పేరుతో స్వచ్ఛమైన పాలను ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో పాల వ్యాపారంలోకి అడుగు పెడుతున్నారు ప్రముఖ...

హ్యాపీ ఆవులు పేరుతో స్వచ్ఛమైన పాలను ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో పాల వ్యాపారంలోకి అడుగు పెడుతున్నారు ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు. నగర శివార్లలో 30 ఎకరాల వ్యవసాయ భూమిలో 30 ఆవులను ఇప్పటికే పెంచుతున్నారు. ప్రస్తుత మార్కెట్లో లభించే పాలు, కూరగాయలను వాడి అయన అనారోగ్యానికి గురయ్యాడట. దాంతో తానే సొంతంగా పాల వ్యాపారం, సేంద్రియ ఎరువులతో పండించే కూరగాయల వ్యాపారం ఎందుకు చేయకూడదు అన్న ఆలోచన వచ్చిందట. డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో కాకుండా ప్రజలకు నాణ్యమైన పాలను అందించాలనే సంకల్పంతో పాటు బయట దొరుకుతున్న పాలకు, స్వచ్ఛమైన పాలకు ఉన్న తేడా తెలియజేయాలన్న ఉద్దేశంతోనే పాల వ్యాపారం మొదలు పెట్టారు . అయితే ధరను కూడా లీటరు ప్యాకెట్‌కి రూ.150లకు విక్రయించాలనుకుంటున్నట్లు సురేష్ బాబు తెలిపారు.

Next Story