logo
జాతీయం

ఆధార్ పై నేడు సుప్రీం కీలక తీర్పు..

ఆధార్ పై నేడు సుప్రీం కీలక తీర్పు..
X
Highlights

ఆధార్‌పై ఈరోజు(బుధవారం) సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. దీనిపై గతంలో వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి...

ఆధార్‌పై ఈరోజు(బుధవారం) సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. దీనిపై గతంలో వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నాలుగు నెలలుగా తీర్పును రిజర్వులో ఉంచింది. దేశంలో దాదాపు 99 శాతం మంది ప్రజలకు జారీ చేసిన ఆధార్‌ నంబర్‌.. భారత పౌరుల ప్రాథమిక హక్కుల్లో ఒకటైన గోప్యత హక్కుకు భంగం కలిగించేలా ఉందని పిటిషన్లు దాఖలయ్యాయి. పౌరుల వేలిముద్రలు, ఐరిస్‌తో ఉన్న ఆధార్‌ డేటాబేస్‌ను ప్రైవేటు వ్యక్తులు దుర్వినియోగపర్చే అవకాశముందని వాదించారు. అయితే ఈ వాదనను కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేస్తుంది. భద్రతకు ఆధార్ తో సంబంధం లేదని.. అవినీతిని నిరోధించడంతో పాటు నిధులు పక్కదారి పట్టకుండా నేరుగా లబ్ధిదారులకు చేరాలన్న ఉద్దేశంతోనే ఆధార్‌ అనుసంధానం చేపట్టామని వాదించింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పు నేటికీవాయిదా వేసింది.

Next Story