logo
సినిమా

మంత్రి కేటీఆర్ ఛాలెంజ్ కు స్పందించిన హీరో మహేష్

మంత్రి కేటీఆర్ ఛాలెంజ్ కు స్పందించిన హీరో మహేష్
X
Highlights

గ్రీన్‌ఛాలెంజ్ కార్యక్రమానికి సినీ, క్రీడా ప్రముఖుల నుంచి మంచి స్పందన వస్తుంది. ఈ ఛాలెంజ్‌లో భాగంగా మంత్రి...

గ్రీన్‌ఛాలెంజ్ కార్యక్రమానికి సినీ, క్రీడా ప్రముఖుల నుంచి మంచి స్పందన వస్తుంది. ఈ ఛాలెంజ్‌లో భాగంగా మంత్రి కేటీఆర్ .. ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్, భార‌త మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్క‌ర్‌, టాలీవుడ్ హీరో మహేశ్ బాబు, హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ క్యాథరిన్ హడ్డాలకు గ్రీన్ ఛాలెంజ్‌ విసిరిన సంగతి తెలిసిందే. మంత్రి కేటీఆర్‌ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ సవాల్‌ను స్వీకరించిన క్రికెటర్స్ సచిన్‌, లక్ష్మణ్‌ మొక్కలు నాటి తమ ఛాలెంజ్‌లను పూర్తి చేశారు. అంతేకాకుండా వారు మరో ఐదుగురికి గ్రీన్‌ఛాలెంజ్ విసిరారు. ఇక మహేశ్‌బాబు మంత్రి సవాల్‌కు స్పందించారు. తన కుమార్తె సితారతో కలిసి మొక్కను నాటి. ఆ ఫోటోలను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. అలాగే మరికొందరికి ఈ ఛాలెంజ్ ను విసిరారు.

Next Story