logo
సినిమా

సన్నీలియోన్‌ కు కవల పిల్లలు

సన్నీలియోన్‌ కు కవల పిల్లలు
X
Highlights

బాలీవుడ్‌ నటి సన్నీలియోన్‌ సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె తన ట్విటర్ ద్వారా...

బాలీవుడ్‌ నటి సన్నీలియోన్‌ సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. సన్నీలియోన్‌, ఆమె భర్త డానియెల్‌ వెబర్‌, పెంపుడు కూతురు నిషా కౌర్‌తో పాటు కవలలు ఉన్న ఓ ఫోటోను పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం తమ కుటుంబం చాలా సంతోషంగా ఉందని సన్నీ ట్వీట్‌ చేశారు. అతి తక్కువ సమయంలో దేవుడు తమకు ముగ్గురు పిల్లలని ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని సన్నీ పేర్కొన్నారు.

గతేడాది సన్నీ లియోన్... మహారాష్ట్రాకు చెందిన రెండేళ్ల పాపని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఆమెకు నిషా వెబర్ కౌర్ అని పేరు పెట్టుకున్నారు. అదే విధంగా సరోగసీ ద్వారా కూడా పిల్లలకు ప్రయత్నించారు. అలా అద్దె గర్భం ద్వారా ఇద్దరు మగపిల్లలకు తల్లయ్యింది సన్నీ. ముగ్గురు పిల్లలతో కలిసి ఉన్న ఫోటోని ట్విట్టర్ పోస్టు చేసి... అభిమానులను సర్ ప్రైజ్ చేసింది. ఇప్పుడు ఆ ముగ్గురు పిల్లల బాధ్యత తమపై ఉందని ఆనందంగా చెబుతోంది. దేవుడు తమకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడని మురిసిపోతోంది. కవల మగ పిల్లలకు ఆషర్ సింగ్ వెబర్.. నోవా సింగ్ వెబర్ అని పేర్లు పెట్టుకున్నారు. ఆ నటికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

బాలీవుడ్లో సరోగసీ ద్వారా పిల్లలను కనడం చాలా సహజం అయిపోయింది. కేవలం సన్నీనే కాదు... ఆమిర్ ఖాన్-కిరణ్ రావు... షారూఖ్ ఖాన్ - గౌరితో పాటూ అనేక జంటలు ఇలా సరోగసీ బాట పట్టాయి. అద్దె గర్భాలపై మన దేశంలో నియమనియంధనలేవీ కఠినంగా లేకపోవడంతో... ఎక్కువ మంది సరోగసీకి వెళుతున్నారు.

Next Story