భారీగా తగ్గిన గ్యాస్ ధరలు..

భారీగా తగ్గిన గ్యాస్ ధరలు..
x
Highlights

రూపాయి విలువ బలపడటం, అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోవడంతో ఎల్‌పీజీ ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఈ క్రమంలో గ్యాస్ వినియోగదారులకు భారీ ఊరట లభించింది....

రూపాయి విలువ బలపడటం, అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోవడంతో ఎల్‌పీజీ ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఈ క్రమంలో గ్యాస్ వినియోగదారులకు భారీ ఊరట లభించింది. ప్రస్తుతం అమలవుతున్న సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్ పై రూ.6.52 లు, సబ్సిడీయేతర సిలెండరు ధరపై రూ.133 తగ్గిస్తున్నట్లు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐఓసీ) శుక్రవారం వెల్లడించింది. తగ్గించిన ధరలు నేటి అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ప్రస్తుతం 14.2కేజీల సబ్సిడీ ఎల్‌పీజీ సిలెండరుధర రూ.500.90కి లభించనుంది. అలాగే ఢిల్లీలో సబ్సిడీయేతర ఎల్‌పీజీ సిలెండరు ధర రూ.809.50కి లభించనుంది. గృహ వినియోగదారులకు సబ్సిడీ కింద ఏటా 12 సిలెండర్లను అందిస్తున్న విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories