ట్రిపుల్ తలాఖ్‌ను మట్టికరిపించింది వీరే..!!

ట్రిపుల్ తలాఖ్‌ను మట్టికరిపించింది వీరే..!!
x
Highlights

పుల్ తలాఖ్ శతాబ్దాలుగా ముస్లిమ్ స్త్రీలని గజగజ వణికిస్తోన్న సంప్రదాయం. దశాబ్దాలుగా భారతదేశంలో వివాదాస్పదంగా నిలుస్తోన్న అంశం! ఎట్టకేలకు సుప్రీమ్...

పుల్ తలాఖ్ శతాబ్దాలుగా ముస్లిమ్ స్త్రీలని గజగజ వణికిస్తోన్న సంప్రదాయం. దశాబ్దాలుగా భారతదేశంలో వివాదాస్పదంగా నిలుస్తోన్న అంశం! ఎట్టకేలకు సుప్రీమ్ కోర్ట్ ట్రిపుల్ తలాఖ్ చట్ట వ్యతిరేకమని తేల్చేసింది. అంతే కాదు, పార్లమెంట్ దీనిపై తగిన చట్టం కూడా చేయాలని ఆదేశించింది. అప్పటి వరకూ కోర్టే ట్రిపుల్ తలాఖ్ ను నిషేధించింది! అయితే, ఈ చారిత్రక తీర్పు వెలువడిన సందర్భరంలో మనం పది మంది గురించి తెలుసుకోవాలి! వారెవరో తెలుసా?

ట్రిపుల్ తలాఖ్ ఈ రోజు రద్దైందంటే కోట్లాది మంది ముస్లిమ్ మహిళల జీవితాలకు భరోసా కలిగిందంటే అందుక్కారణం అయిదుగురు ధీర వనితలు! వాళ్లు ప్రాణాలకి తెగించి చేసిన న్యాయ పోరాటమే ఇవాళ్టి అంతిమ తీర్పుకి కారణం. ఉత్తరాఖండ్ కు చెందిన షయరా బానో ట్రిపుల్ తలాఖ్ పై కత్తి దూసిన తొలి మహిళ. కాశీపూర్ అనే ప్రాంతంలో వుండే ఆమెకు పదిహేనేళ్ల వైవాహిక జీవితం తరువాత, ఇద్దరు పిల్లలు పుట్టాక భర్త ఏకపక్షంగా ట్రిపుల్ తలాఖ్ చెప్పాడు. 2015నుంచీ ఆమె అలసట చెందకుండా దురాచారంపై పోరాడి విజయం సాధించింది! రాజస్థాన్ లోని జైపూర్ కి చెందిన అఫ్రీన్ రెహ్మాన్ 2014లో వివాహం చేసుకుంది. ఓ మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా ఆమెకు పెళ్లి జరిగింది. కాని, కొంత కాలానికే ఆమెను అత్తింటి వారు అదనపు కట్నం కోసం వేధించారు. ఆ బాధలు తాళలేక పుట్టింటికి వచ్చిన అఫ్రీన్ రెహ్మాన్ భర్త పోస్టు ద్వారా ట్రిపుల్ తలాఖ్ చెప్పేశాడు!ఉత్తర్ ప్రదేశ్ లోని రామ్ పూర్ కు చెందిన గుల్షన్ పర్వీన్ కూడా అత్తింటి అదనపు కట్నపు వేధింపులు తాళలేకే పుట్టింటికి చేరింది. 2013లో ఆమె పెళ్లికాగా 2015లో భర్త ఆమెకు ట్రిపుల్ తలాఖ్ చెప్పాడు. బెంగాల్ లోని హౌరాకు చెందిన ఇష్రత్ జహాన్ కూడా ట్రిపుల్ తలాఖ్ బాధితురాలు. నలుగురు పిల్లల తల్లి అయిన ఆమె పదిహేనేళ్ల వైవాహిక జీవితం తరువాత 2015లో ట్రిపుల్ తలాఖ్ బారిన పడాల్సి వచ్చింది. ఆమె భర్త దుబాయ్ నుంచి ఫోన్ లో ట్రిపుల్ తలాఖ్ చెప్పేశాడు! ఇద్దరు పిల్లల తల్లైన ఉత్తర్ ప్రదేశ్ షహ్రాన్ పూర్ కు చెందిన అతియా సబ్రి కూడా వరకట్న వేధింపుల తరువాత ట్రిపుల్ తలాఖ్ హింసకు గురైంది! 2012లో ఆమె పెళ్లి కాగా 2015లో ఆమెను ట్రిపుల్ తలాఖ్ కబళించింది!షాయరా బానో, అఫ్రీన్ రెహ్మాన్, గుల్షన్ పర్వీన్, ఇష్రత్ జహాన్, అతియ సబ్రి. వీళ్లు అయిదుగురు ట్రిపుల్ తలాఖ్ పై పోరాటం చేసిన వారైతే మరో అయిదుగురు కూడా చారిత్రక ట్రిపుల్ తలాఖ్ కేసుతో ముడిపడి వున్నారు! వారే ట్రిపుల్ తలాఖ్ చెల్లదని తీర్పునిచ్చిన అయిదుగురు సుప్రీమ్ కోర్టు జడ్జ్‌లు!

ట్రిపుల్ తలాఖ్ కేసుని విచారించిన అయిదుగురు న్యాయమూర్తులు అయిదు భిన్న విశ్వాసాలకు చెందిన వారు కావటం మరింత విశేషం! ప్రస్తుత సుప్రీమ్ ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖెహర్ జన్మతహ సిక్కు మతస్థుడు. ఆయనే కాక ట్రిపుల్ తలాఖ్ కేసుని విచారించిన మరో జడ్జ్ జస్టిస్ కురియన్ జోసెఫ్. ఈయన క్రిస్టియన్! ఇక అయిదుగురిలో మరో న్యాయమూర్తి జస్టిస్ నారీమన్. ఇతని మతం పార్సీ! ట్రిపుల్ తలాఖ్ చారిత్రక తీర్పునిచ్చిన నాలుగో జస్టిస్ యూయూ లలిత్! ఈయన హిందూ మతానికి చెందిన వారు. ఇక ట్రిపుల్ తలాఖ్ ప్రధానంగా ముస్లిమ్ మతస్థుల సమస్య కాబట్టి అయిదుగురు సుప్రీమ్ జడ్జ్ లలో ఒక ముస్లిమ్ న్యాయమూర్తి కూడా వున్నారు!

ఆయనే అబ్దుల్ నజీర్! మొత్తం అయిదుగురు జడ్జీల్లో ఇద్దరు ట్రిపుల్ తలాఖ్ కు వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. కాని, హిందూ, క్రిస్టియన్, పార్సీ న్యాయమూర్తుల మెజార్జీ అభిప్రాయంతో ట్రిపుల్ తలాఖ్ చట్ట వ్యతిరేకంగా ప్రకటితమైంది! ఏది ఏమైనా అయిదుగురు పట్టువదలని ముస్లిమ్ మహిళల పోరాటానికి అయిదుగురు భిన్న మతస్థులైన జడ్జీలు తగిన విధమైన తీర్పునిచ్చారు! ఇదే అసలు సిసలైన ఇండియా!

Show Full Article
Print Article
Next Story
More Stories