నటించింది చాలు ! ఇక ఆపు !

తమిళనాడు తూత్తుకుడిలో గురువారం మళ్ళీ ఉద్రిక్తత తలెత్తింది. స్టెరిలైట్ రాగి ప్లాంట్ కు వ్యతిరేకంగా ఆందోళన...
తమిళనాడు తూత్తుకుడిలో గురువారం మళ్ళీ ఉద్రిక్తత తలెత్తింది. స్టెరిలైట్ రాగి ప్లాంట్ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారిపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. కాల్పుల్లో గాయపడిన 22 ఏళ్ళ కలియప్పన్ అనే వ్యక్తి కిందపడిపోయి బాధతో విలవిలలాడుతుండగా..అతడ్ని ఆసుపత్రికి తరలించాల్సిన పోలీసుల్లో ఒకరు.. ‘ నటించింది చాలు..ఇక ఆపు ..’ అంటూ కసురుకున్నాడు. స్థానిక రిపోర్టర్ ఒకరు దీన్ని వీడియో తీశాడు. కలియప్పన్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోగానే మృతి చెందాడు.ముందస్తు హెచ్చరికలు లేకుండా ప్రజలపై కాల్పులు జరిపినందుకు గానూ తూత్తుకుడి జిల్లా కలెక్టర్, పోలీసు అధికారిని బుధవారం బదిలీ చేశారు. ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. కాల్పులు జరుపుతున్న సమయంలో ఓ పోలీసు అధికారి బస్సు పైకి ఎక్కి ‘కనీసం ఒక్కరైనా చావాలి’ అని అంటున్న వీడియో వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.
#Police says to an Fired and Injured man "Don't Act" #Sterliteprotest #Bansterlite #Thoothukudi pic.twitter.com/vwy7mVwc6T
— Vikram VFC (@Vijayfans007) May 23, 2018
Breaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMT
ఉద్యోగులు పెన్షనర్లకి శుభవార్త.. రిటైర్మెంట్ చేసిన వెంటనే ప్రయోజనం..!
8 Aug 2022 4:15 PM GMTRajinikanth: రాజకీయ రంగ ప్రవేశంపై తలైవా ఏమన్నారంటే?!
8 Aug 2022 4:00 PM GMTLIC New Policy: ఎల్ఐసీ అదిరే పాలసీ.. ప్రతి నెలా రూ. 2190 చెల్లిస్తే...
8 Aug 2022 3:30 PM GMTCM Jagan: ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదు..
8 Aug 2022 3:15 PM GMTవీడ్కోలు కార్యక్రమంలో వెంకయ్య భావోద్వేగ ప్రసంగం
8 Aug 2022 3:00 PM GMT