డేటా లీకేజీతో ఫేస్ బుక్ వ్యాపారం

డేటా లీకేజీతో ఫేస్ బుక్ వ్యాపారం
x
Highlights

ఫేస్ బుక్ డేటా గ‌ల్లంతుపై స్పందించిన వైట్ హౌజ్ మాజీ అధికారి స్టీవ్ బ‌న్నోన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వ్యాపారం కోసం వ్య‌క్తిగ‌త డేటాను ఫేస్ బుక్...

ఫేస్ బుక్ డేటా గ‌ల్లంతుపై స్పందించిన వైట్ హౌజ్ మాజీ అధికారి స్టీవ్ బ‌న్నోన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వ్యాపారం కోసం వ్య‌క్తిగ‌త డేటాను ఫేస్ బుక్ అమ్ముతున్న‌ట్లు ఆరోపించారు.
ఫేస్ బుక్ డేటా తో అమెరిక అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో డొనాల్డ్ ట్రంప్ త‌రుపున ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఉప‌యోగించారు. డాక్టర్‌ అలెగ్జాండర్‌ కోగన్‌ కేంబ్రిడ్జ్‌లో సైకాలజీలో ప్రొఫెసర్‌ మనుషుల మనస్తత్వం ఎలా మారుతోంది అనే అంశంపై ‘దిసీజ్‌ యువర్‌ డిజిటల్‌ లైఫ్‌’ అనే యాప్‌ రూపొందించాడు. దాన్ని పెద్ద‌సంఖ్య‌లో విస్త‌రించాలంటే ఫేస్‌బుక్‌కు అనుసంధానం చేయాలి. అలా చేయాలంటే ఫేస్ బుక్ డేటా కావాలి .అందుకే.. క్రిస్టొఫర్‌ వైలీ ఈయన డేటా అనలిటిక్స్‌లో అఖండుడు. ఒకప్పుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ప్రచార సహాయకుడిగా తరువాత ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన స్టీవ్‌ బానన్‌కు సన్నిహితుడు. సామాజిక మాధ్యమాల్ని విరివిగా వాడుకొని, వాటి ద్వారా ఓటర్లకు చేరువ కావొచ్చని, పెద్ద పెద్ద నెట్‌వర్కింగ్‌ సైట్లకు డబ్బు ఎరవేసి డేటాను తీసుకోవచ్చని వైలీ ఓ ప్రతిపాదన చేశాడు. బానన్‌ దానిపై ఆసక్తి చూపడంతో.. కేంబ్రిడ్జ్‌ అనలిటికా అనే సంస్థను స్థాపించి- దాని ద్వారా ఆపరేషన్‌ కొనసాగించాలని భావించాడు. అయితే తప్పు చేస్తున్నానని పశ్చాత్తాపపడి ఆ పనిని పూర్తి చేయడానికి అంగీకరించలేదు. కానీ డేటా అనలిటిక్స్‌ సంస్థలోని మిగిలిన వారు మాత్రం అలెగ్జాండర్‌ కోగన్‌ను సంప్రదించి డేటాసేకరించి ట్రంప్‌ ప్రచార సమయంలో వాడుకున్నారు. విశేషమేమంటే ఈ డేటా లీక్‌ గురించి మొదట బయటపెట్టినది వైలీయే. గార్డియన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనిచ్చిన సమాచారం ఆధారంగానే మొత్తం డొంకంతా కదిలింది.
ఈ విష‌యం బ‌య‌ట‌కు పొక్క‌డంతో ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జూక‌ర్ బెర్గ్ స్పందించారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న కేంబ్రిడ్జ్ అనలిటికా స్కామ్‌పై జుకర్ బర్గ్ వివరణ ఇచ్చారు. రెండు సంస్థల మధ్య జరిగిన విశ్వాసాల ఉల్లంఘన ఇదని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని జుకర్ బర్గ్ హామీ ఇచ్చారు.
ఫేస్‌ బుక్ వ్యక్తిగత సమాచారాన్ని కొన్ని యాప్‌లు దుర్వినియోగం చేస్తున్నాయని, వీటి విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ తరహా యాప్‌లను ఇప్పటికే నిషేధించామని వెల్లడించారు.
అయితే వైట్ హౌజ్ మాజీ అధికారి స్టీవ్ బ‌న్నోన్ ఫేస్ బుక్ వ్య‌క్తిగ‌త డేటాను అమ్మ‌కానికి పెడుతున్నారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఫైనాన్షియల్ టైమ్స్ తో మాట్లాడిన బ‌న్నోస్ ఫేస్‌బుక్ షేర్ల విలువ పెరగడానికి, ఆ కంపెనీ వ్యాపారం పెరగడానికి కారణమదేనని ఆయన అభిప్రాయపడ్డారు.కేంబ్రిడ్జి ఎనలైటికాకు యూఎస్ ఓటర్ల డేటాను అమ్ముకొందన్న ఆరోపణలను ఆయన ఖండించారు.. కేంబ్రిడ్జ్ ఎనలైటికా మాతృ, సంస్థ ఎస్‌సీఎల్ సుమారు 50 మిలియన్ల ఖాతాదారుల సమాచారాన్ని దుర్వినియోగం చేసిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహరంలో బన్నోన్ హస్తం కూడ ఉందని కూడ ఆరోపణలొచ్చాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories