స్టార్స్‌తో కూటమి వెలుగుతుంది... స్టార్‌ తిరుగుతుందా మరి !!

స్టార్స్‌తో కూటమి వెలుగుతుంది... స్టార్‌ తిరుగుతుందా మరి !!
x
Highlights

ఒకరు స్వయంకృషితో ఎదిగి వెండితెరను ఏలిన ఆపద్బాంధవుడు. మరొకరు తండ్రి వారసత్వంతో సిల్వర్‌ స్క్రీన్‌ను షేక్‌ చేసిన లెజెండ్. ఇంకొకరు స్టార్టలకు తన...

ఒకరు స్వయంకృషితో ఎదిగి వెండితెరను ఏలిన ఆపద్బాంధవుడు. మరొకరు తండ్రి వారసత్వంతో సిల్వర్‌ స్క్రీన్‌ను షేక్‌ చేసిన లెజెండ్. ఇంకొకరు స్టార్టలకు తన సినిమాలతో దడ పుట్టించిన లేడీ సూపర్‌ స్టార్. ఇప్పుడు ఈ ముగ్గురూ, పాలిటిక్స్‌లో ఉన్నారు. అంతేకాదు, ఈ ముగ్గురు స్టార్సు, మహాకూటమి పార్టీల సభ్యులే. ఇప్పటికే ఇద్దరు, క్యాంపెయినింగ్‌కు క్లాప్‌ కొట్టారు. మరో స్టార్‌ను కూడా రంగంలోకి దించాలని కాంగ్రెస్‌ ప్లాన్ చేస్తోంది. ఈ ముగ్గురు స్టార్స్‌‌ను రంగంలోకి దించడంలో మహాకూటమి ప్లానేంటి? విడివిడిగా ప్రచారం చేస్తారా....కలివిడిగా దుమ్మురేపుతారా?

మహాకూటమిలో పొలిటికల్‌ ఫైర్‌బ్రాండ్‌లకే కాదు, సినిమా స్టార్స్‌కూ కొదువలేదు. కూటమిలో ఉన్న వివిధ పార్టీల సినిమా తారలను, క్యాంపెయిన్‌లో వినియోగించుకోవాలని, పార్టీలు భావిస్తున్నాయి. అందుకు అనుగుణంగా ఇద్దరు స్టార్స్‌తో చర్చలు జరుపుతున్నాయి. స్టార్స్‌ను ప్రచారపర్వంలో దించడంలో, కూటమి ప్లాన్‌ పక్కాగా ఉంది. తారలను క్యాంపెయిన్‌లో భాగం చేయడం ద్వారా, తక్కువ సమయంలో ెెఎక్కువ మందికి మహాకూటమిని, చేరువ చేయొచ్చన్నది కాంగ్రెస్ ప్లాన్. గతంలో ఎన్టీఆర్, జయసుధ, ఇతర సినీ నటులు రాజకీయ పార్టీల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ ప్రచారాలన్నీ సక్సెస్‌ అయ్యాయి. స్టార్స్ ప్రచారంలో పాల్గొంటే, జనసమీకరణకు ఎటువంటి ఇబ్బందీ ఉండదు. తారలను చూసేందుకు జనం ఎగబడతారు. దీంతో కూటమి చెప్పాలనుకునే విషయాన్ని ప్రజల్లోకి ఈజీగా తీసుకెళ్ళొచ్చనేది పార్టీల ప్లాన్.

ఒకప్పటి సినిమా స్టార్, ఇప్పటి కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి, ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. విజయశాంతి రోడ్ షోలకు, పబ్లిక్ మీటింగ్‌లకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. భారీగా జనం తరలివస్తున్నారు. సినిమా స్టార్స్‌ సభలకు జనసమీకరణకు కష్టపడాల్సిన అవసరం లేదని, విజయశాంతి సభలే అందుకు నిదర్శమని భావిస్తున్నాయి మహాకూటమి పార్టీలు. దీంతో మరికొంతమంది స్టార్స్‌ను ప్రచారంలో భాగం చేయాలనుకుంటున్నాయి. ఖమ్మంలో టీడీపీ తరపున నందమూరి బాలకృష్ణ చేసిన ప్రచారానికి విశేష స్పందన లభించింది. దీంతో రాష్ట్రం మొత్తం బాలకృష్ణతో ప్రచారం చేయించాలనుకుంటుంది టీ టీడీపీ. ఎన్టీఆర్‌ బయోపిక్ సినిమాలో బిజీగా ఉన్న బాలకృష్ణను ఇప్పటికే ఒకసారి టీడీపీ నేతలు కలిశారు. మహాకూటమి తరపున ప్రచారం చేయాల్సిందిగా కోరారు. దీనికి ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. తెలంగాణ మొత్తం కాకున్నా కనీసం టీడీపీ పోటీ చేసే స్థానాల్లో అయినా ప్రచారం చేస్తారని టీ టీడీపీ నేతలు భావిస్తున్నారు.

ఇక మెగాస్టార్‌ చిరంజీవిని కూడా రంగంలోకి దింపాలనుకుంటోంది కాంగ్రెస్. ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాలకి చిరు, దూరంగా ఉన్నప్పటికీ, ఆయన్ను మళ్ళీ యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి రప్పించాలన్నది, గాంధీభవన్ ప్లాన్. ప్రస్తుతం సైరా సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నారు చిరంజీవి. అయితే క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు చిరంజీవి. ఈ ఎన్నికల్లో చిరంజీవిని తమ ప్రచారానికి ఉపయోగించుకోవాలనుకుంటుంోంది తెలంగాణ కాంగ్రెస్. సినిమాలలో విజయశాంతి, చిరంజీవిలది మంచి హిట్ ఫెయిర్. వీరిద్దరూ కలసి ప్రచారం చేస్తే, అది కాంగ్రెస్‌కి, మహాకూటమికి మంచి మైలేజ్ వస్తుందని నేతలు భావిస్తున్నారు. అయితే చాలా రోజులుగా రాజకీయాలపై అనాసక్తి చూపుతున్న చిరంజీవి, కాంగ్రెస్ ఆహ్వానాన్ని మన్నించి, ప్రచారపర్వంలోకి దిగుతారా అన్నది ప్రశ్న.

మొత్తానికి క్యాంపెయిన్‌కు, మెగాస్టార్‌ ఒప్పుకుంటే, ముగ్గురు స్టార్స్‌తో వెలిగిపోతుంది మమాకూటమి. ముగ్గురు కలిసి, ఒకే వేదికపై నుంచి ప్రచారం చేస్తే, అభిమానులకు కన్నుల పండుగే. వేరువేరుగా చేసినా, వారి సభలు జనంతో కిక్కిరిసిపోవడం ఖాయం. అదే ఆలోచనతోనే, స్టార్స్‌తో ప్రచారం చేయించాలనుకుంటోంది మహా కూటమి. మరి స్టార్స్ సహకరిస్తారో లేదో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories