భాగ్యనగరంలో వినాయక నిమజ్జనం సందడి

భాగ్యనగరంలో వినాయక నిమజ్జనం సందడి
x
Highlights

భాగ్యనగరంలో వినాయక నిమజ్జనం సందడి మొదలయింది. నిమజ్జనానికి ఆపద్ధర్మ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు...

భాగ్యనగరంలో వినాయక నిమజ్జనం సందడి మొదలయింది. నిమజ్జనానికి ఆపద్ధర్మ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు తగు జాగ్రాత్తలు తీసుకుంటున్నారు. కాగా ఇవాళ(ఆదివారం) ఆఖరు కావడంతో ఖైరతాబాద్ భారీ గణేషుడిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. నేడు(ఆదివారం) ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఖైరతాబాద్ గణేష్ దర్శనం కోసం ఢిల్లీ నుంచి వస్తున్నారు. విగ్రహాల నిమజ్జనం కోసం ట్యాంక్‌బండ్‌తో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 35 చెరువుల దగ్గర 117 క్రేన్లను ఏర్పాటు చేశారు. మరో 96 మొబైల్ క్రేన్‌లను కూడా సిద్ధం చేశారు. నిమజ్జన శోభాయాత్ర జరిగే ప్రధాన రహదారుల్లో 10 కోట్లతో రోడ్ల రీ-కార్పెటింగ్‌, మరమ్మత్తులు, పూడ్చివేత పనులను పూర్తి చేశారు బల్దియా అధికారులు. ఈ ఏడాది నిమజ్జనంలో వినియోగించే క్రేన్లకు అత్యాధునిక హుక్స్‌ ఏర్పాటు చేశారు. ఇవి ఆటోమెటిక్‌గా రిలీజ్‌ అవుతాయి. దీంతో ఒక్కో విగ్రహం నిమజ్జనంలో 4 నుంచి 6 నిమిషాల సమయం ఆదా అవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా వినాయక నిమజ్జనం సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నామని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులకోసం ఫేషియల్ రేకగ్నైజ్‌డ్ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. వినాయక నిమజ్జన ఏర్పాట్లను జియో ట్యాగింగ్ చేశామన్నారు. 65వేలమంది పోలీసులు ప్రత్యక్షంగా, పరోక్షంగా విధుల్లో ఉంటారని డీజీపీ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories