logo
సినిమా

రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి ముహూర్తం ఫిక్స్

రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి ముహూర్తం ఫిక్స్
X
Highlights

భారతదేశం గర్వించదగ్గ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమా తెలుగు సినిమా స్థాయిని ఓ రేంజిలో ...

భారతదేశం గర్వించదగ్గ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమా తెలుగు సినిమా స్థాయిని ఓ రేంజిలో పెంచింది. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో ఎవరు నటించబోతున్నారు? అనే అంశంపై చాలాకాలంపాటు చర్చలు జరిగాయి. కానీ ఇద్దరు పెద్ద హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ ఈ చాన్స్‌ను దక్కించుకున్నారు.వీరిద్దరూ నటీనటులుగా ఓ ముల్టీస్టారర్ చిత్రం తెరకెక్కుతోంది. ఎనిమిది నెలల పాటు కధా చర్చలు సాగించిన రాజమౌళి ఎట్టకేలకు సినిమా షూటింగ్ ప్రారంభ ముహుర్తాన్ని డిక్లేర్ చేశాడు. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు ముహూర్తం ప్రారంభం కానున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. 'భారీ మల్టీస్టారర్‌ మూవీ ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ ప్రారంభ వేడుక ఈ ఏడాది 11వ నెల 11వ తేదీ ఉదయం 11గంటలకు ప్రారంభం కానుందని' ఈ మేరకు 34 సెకన్ల నిడివి ఉన్న ఓ వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ ప్రతినిధులు సామజిక మాధ్యమాల్లో షేర్ పోస్ట్ చేశారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు తమిళ హిందీ భాషల ప్రేక్షకులకు సులువుగా కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా ఉంటుందని అభిమానులు అనుకుంటున్నారు.

Next Story