ఫైనల్‌ డిస్కషన్స్‌.. అమరావతికి దర్శకుడు రాజమౌళి

ఫైనల్‌ డిస్కషన్స్‌.. అమరావతికి దర్శకుడు రాజమౌళి
x
Highlights

దర్శకుడు రాజమౌళి రేపు అమరావతికి రానున్నారు. అసెంబ్లీ, హైకోర్టు తుది డిజైన్లపై నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులు, మంత్రి నారాయణ, సీఆర్డీఏ అధికారులతో...

దర్శకుడు రాజమౌళి రేపు అమరావతికి రానున్నారు. అసెంబ్లీ, హైకోర్టు తుది డిజైన్లపై నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులు, మంత్రి నారాయణ, సీఆర్డీఏ అధికారులతో చర్చించనున్నారు. తుది డిజైన్లపై సూచనలు సలహాలు ఇవ్వనున్నారు. ఇక సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశంకానున్నారు. ఎల్లుండి డిజైన్లను ఫైనలైజ్‌ చేయనున్నారు. అసెంబ్లీ భవనం అమరావతికే కాకుండా రాష్ట్రానికే మణిమకుటంగా ఉండాలన్న తన అభిలాషను చంద్రబాబు పునరుద్ఘాటించారు. అది మన ఘన చరిత్ర, వారసత్వ, సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతూనే వైవిధ్యానికి, సృజనాత్మకతకూ నిలువెత్తు దర్పణంగా నిలిచి, తరతరాలపాటు తెలుగువారందరికీ గర్వకారణంగా నిలవాలని సీఎం తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories