‘నిందితుడు జగన్‌కు వీరాభిమాని’

‘నిందితుడు జగన్‌కు వీరాభిమాని’
x
Highlights

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసిన శ్రీనివాసరావు గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జగన్‌కు శ్రీనివాస్...

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసిన శ్రీనివాసరావు గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జగన్‌కు శ్రీనివాస్ వీరాభిమాని అని అతని అన్న సుబ్బరాజు అంటున్నాడు. సంక్రాంతి పండగ సందర్భంగా ఆరడుగుల జగన్‌ కటౌట్‌ ఏర్పాటు చేసిన తన సోదరుడు ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నామని తెలిపారు. నిందితుడు శ్రీనివాస్‌ మానసి ఆరోగ్యం సరిగానే ఉందని, అతడికి ఎలాంటి సమస్యాలేదన్నారు. తమది పేద కుటుంబమని, పనిచేసుకుంటే గానీ పూటగడవని పరిస్థితి తమదని ఆవేదన వ్యక్తంచేశారు. అలాంటి పరిస్థితుల్లో తన సోదరుడు ఎందుకిలా చేశాడో అర్థంకావడంలేదంటూ వాపోయారు. నిందితుడు తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం మండలం ఠానేలంకకు చెందినవాడు. అతడు ఏడాదికాలంగా విశాఖ విమానాశ్రయంలో ఓ హోటల్‌లో చెఫ్‌గా పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories