logo
జాతీయం

బద్రీనాథ్‌లో చిక్కుకున్న శ్రీకాకుళం జెడ్పీటీసీలు

బద్రీనాథ్‌లో చిక్కుకున్న శ్రీకాకుళం జెడ్పీటీసీలు
X
Highlights

ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న మంచు తుఫానులో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఛైర్ పర్సన్ చౌదరి ధనలక్ష్మితో పాటు పలువురు...

ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న మంచు తుఫానులో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఛైర్ పర్సన్ చౌదరి ధనలక్ష్మితో పాటు పలువురు జెడ్పీటీసీలు చిక్కుకున్నారు. ఉపాధి హామి పనుల అమలు తీరును పరిశీలించేందుకు వీరంతా గత వారంలో ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్లారు. చార్‌ధామ్ సమీపంలోని సీతాపురి ప్రాంతంలో గత రెండు రోజులుగా కురుస్తున్న మంచు తుఫానులో వీరంతా చిక్కుకున్నారు. స్ధానికంగా ఉన్న ప్రభుత్వ వసతి గృహంలో బస చేసిన వీరు తమ పరిస్ధితిని జిల్లా అధికారులకు తెలియజేశారు. దీంతో వెంటనే స్పందించిన సిబ్బంది ఉత్తరాఖండ్ అధికారులతో మాట్లాడి సురక్షిత ప్రాంతానికి తరలించే ఏర్పాట్లు చేశారు.

Next Story