logo
జాతీయం

మీడియాకు చిక్కకుండా శ్రీదేవి పార్థివదేహం తరలింపు

మీడియాకు చిక్కకుండా శ్రీదేవి పార్థివదేహం తరలింపు
X
Highlights

శ్రీదేవి పార్థీవ దేహం ఎట్టకేలకు ముంబై ఛత్రపతి విమానశ్రయానికి చేరుకుంది. దుబాయ్‌ నుంచి ప్రత్యేక విమానంలో...

శ్రీదేవి పార్థీవ దేహం ఎట్టకేలకు ముంబై ఛత్రపతి విమానశ్రయానికి చేరుకుంది. దుబాయ్‌ నుంచి ప్రత్యేక విమానంలో భౌతికకాయాన్ని ముంబైకి తీసుకొచ్చారు. శ్రీదేవి భౌతికకాయాన్ని ముంబై ఎయిర్‌పోర్టునుంచి ఆమె స్వగృహానికి తరలిస్తున్నారు. లోఖండ్‌‌వాలా గ్రీన్ ఏకర్స్‌లోని శ్రీదేవి నివాసానికి మీడియాకు చిక్కకుండా సర్వీస్ రోడ్ ద్వారా భౌతికకాయాన్ని తరలిస్తున్నారు. ప్రత్యేక అంబులెన్సులో పార్థివదేహాన్ని తరలిస్తున్నారు. అయితే ఆమెను కడసారి చూసేందుకు భారీఎత్తున తరలివెళ్లిన అభిమానులు తీవ్ర నిరాశతో ఇంటికి వెనుదిరిగారు. ప్రస్తుతం ఇంకా శ్రీదేవి ఇంటికి భౌతికకాయం చేరుకోలేదు. మరో 15 నిమిషాల్లో పార్థికదేహం స్వగృహానికి చేరుకోనుంది. మరోవైపు ఇప్పటికే పెద్దఎత్తున నటీనటులు ముంబైకి చేరుకున్నారు. అంబులెన్సులో తరలిస్తున్నారని తెలుసుకున్న నటులు శ్రీదేవి ఇంటికి చేరుకుంటున్నారు.

Next Story