న్యాయం కోసం ఫిలింనగర్‌లో నగ్నంగా నిలబడ‌తా

న్యాయం కోసం ఫిలింనగర్‌లో నగ్నంగా నిలబడ‌తా
x
Highlights

దర్శకుడు శేఖర్ కమ్ములతో వివాదం ఓ వైపు కొనసాగుతుండగానే టాలీవుడ్ నటి శ్రీరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. అవకాశాల పేరుతో అమ్మాయిలను మోసం...

దర్శకుడు శేఖర్ కమ్ములతో వివాదం ఓ వైపు కొనసాగుతుండగానే టాలీవుడ్ నటి శ్రీరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. అవకాశాల పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్న సినీ, టెలివిజన్ ప్రముఖుల గుట్టు విప్పింది. తనను శారీరకంగా, మానసికంగా వేధించారంటూ ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌ లైవ్‌లో కొందరిపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
టాలీవుడ్‌లో జరుగుతున్న అన్యాయాలకు సంబంధించిన ఆధారాలు నావద్ద ఉన్నాయి. అందుకే నేను వాటిని లీక్ చేస్తున్నాను. మీడియా సాక్ష్యంగా నేను అన్ని విషయాలు బయటపెడుతా. నా వద్ద కొన్నింటికి ఆధారాలు ఉన్నాయి. కొన్నింటికి ఆధారాలు లేవు.
నేను శేఖర్ కమ్ములను ఉద్దేశించి నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నేను నటించిన అరవింద్2 సినిమా డైరెక్టర్ పేరు కూడా శేఖర్. గుమ్మడి కాయల దొంగ అంటే శేఖర్ కమ్ముల భుజాలు ఎందుకు తడుముకుంటున్నారో అర్థం కావడం లేదు.
శేఖర్ అంటే ఆయనెందుకు రెస్పాండ్ అవుతున్నారు. ఆయన లీగల్ నోటీసులు పంపితే నేను అంగీకరించను. నేను శేఖర్ కమ్ముల పేరును ఎక్కడా డైరెక్ట్‌గా చెప్పలేదు.
ఈటీవీ, ఈనాడు గ్రూప్ అంటే తెలుగుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే మీడియా సంస్థ. అందులో జరుగుతున్న అన్యాయాలపై ఈ సంస్థ అధినేత రామోజీరావు దృష్టికి తీసుకొస్తాను. అది ఇస్తే మేము ఇది ఇస్తాం అని అడగడం ఎంతవరకు న్యాయం అని శ్రీరెడ్డి ప్రశ్నించింది.
ఈటీవీలో పనిచేసే అనిల్ కడియాలకు అమ్మాయిల పిచ్చి ఉంది. నాతో చాలా అసభ్యంగా ప్రవర్తించేవాడు. నేను యాంకర్‌గా ప్రయత్నించే రోజుల్లో నన్ను నగ్నంగా ఫొటో దిగి తనకు ఫొటోలను పంపించమని అడిగాడు. సిగ్గుతో ఆ పని చేయకుండా నేను బ్రా మీద ఫొటో దిగి పంపించాను అని శ్రీరెడ్డి ఆరోపణలు చేసింది.
నటిగా నాకు ఇండస్ట్రీలో గుర్తింపు లేదు. గుర్తింపు కార్డు ఇవ్వలేదు. సీనియర్ నటులు నాకు అండగా నిలువడం లేదు. తెలుగు అమ్మాయిలు కష్టపడుతుంటే నోరు మూసుకుంటున్నారు. ఓ ఆడదాని ఆవేదన పట్టించుకోవడం లేదు.
నాకు జరుగుతున్న అన్యాయం మీడియా ద్వారా బయటపెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆడవాళ్ల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్న సర్కారు ఎందుకు మౌనంగా ఉంటున్నది. ఇలాంటి అన్యాయాలకు ప్రభుత్వం చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది.
బుధవారం రాత్రి జరిగిన చర్చలో ఇండియన్ ఐడల్ శ్రీరాం పేరు కూడా బయటకు వచ్చింది. ఇండియన్ ఐడల్ శ్రీరాంతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను శ్రీరెడ్డి బయటపెట్టింది. కృష్ణవంశీ కూడా నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. కానీ నా వద్ద ఆధారాలు లేవు అని చెప్పింది.
మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్‌లో నాకు ఎందుకు సభ్యత్వం ఇవ్వరు. ‘మా'లో పెత్తందారి వ్యవస్థ కొనసాగుతున్నది. సమాజంలో అందరికీ అన్ని రకాల హక్కులు ఉన్నాయి. ఇండస్ట్రీలో సభ్యత్వం ఇవ్వడం లేదు. ఇది అన్యాయానికి నిదర్శనం కాదా అని శ్రీరెడ్డి ప్రశ్నించారు.
ఒక టెలివిజన్ ఛానెల్‌లో ఏదో భూతులు మాట్లాడారని వారిపై అందరూ నిరసన దిగారు. నటీనటులంతా ఘాటుగా స్పందించారు. అదే నా విషయంలో నాకు న్యాయం జరుగడం లేదు. నాకు కనుక న్యాయం జరుగకపోతే ఫిలింనగర్‌లో బట్టలు లేకుండా నగ్నంగా నిలబడుతా అని శ్రీరెడ్డి హెచ్చరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories