logo
సినిమా

145 నిమిషాల 'స్పైడ‌ర్‌'

145 నిమిషాల స్పైడ‌ర్‌
X
Highlights

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు తొలిసారిగా చేసిన‌ ద్విభాషా చిత్రం 'స్పైడ‌ర్‌'. తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కిన‌ ఈ ...

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు తొలిసారిగా చేసిన‌ ద్విభాషా చిత్రం 'స్పైడ‌ర్‌'. తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కిన‌ ఈ సినిమాకి ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 'స్టాలిన్' త‌రువాత మురుగ‌దాస్ చేస్తున్న తెలుగు చిత్ర‌మిదే కావ‌డం విశేషం. ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమా విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రం తెలుగు వెర్ష‌న్ సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. యు/ఎ స‌ర్టిఫికేట్ పొందిన ఈ సినిమా 145 నిమిషాలు అంటే 2 గం|| 25 ని||ల నిడివితో ఉంటుంద‌ట‌. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్‌.జె.సూర్య విల‌న్‌గా న‌టించిన ఈ సినిమాకి హేరిస్ జైరాజ్ సంగీత‌మందించారు. భారీ అంచ‌నాల‌తో వ‌స్తున్న ఈ స్పై థ్రిల్ల‌ర్ ఆ అంచ‌నాల‌ను అందుకుంటుందో లేదో చూడాలి.

Next Story