స్పీకర్ కు తప్పిన ప్రమాదం!

స్పీకర్ కు తప్పిన ప్రమాదం!
x
Highlights

తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్‌పైకి లారీ దూసుకెళ్లింది. డ్రైవర్ అప్రమత్తతో ప్రమాదం తప్పింది....

తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్‌పైకి లారీ దూసుకెళ్లింది. డ్రైవర్ అప్రమత్తతో ప్రమాదం తప్పింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండలకేంద్రంలో శుక్రవారంరాత్రి స్పీకర్‌ పల్లెనిద్ర చేసిన స్పీకర్ శనివారం ఉదయం గణపురంలో నిర్మించిన బస్టాండ్‌ను ప్రారంభించి తిరిగి భూపాల పల్లికి బయలుదేరారు. ములుగు వైపు పైపులను తీసుకుని ఎదురుగా వస్తున్న లారీ కాన్వాయ్‌పైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో స్పీకర్ వాహనం వెనకాల వస్తున్న ఎస్కార్ట్ డ్రైవర్‌ అప్రమత్తమై వాహనాన్ని రోడ్డు పక్కకు దింపాడు. అంతలో లారీ డ్రైవర్‌ సడెన్‌ బ్రేక్‌ వేశాడు.వెనకాల వస్తున్న మరో లారీ ముందున్న లారీని ఢీకొట్టింది.

Show Full Article
Print Article
Next Story
More Stories