పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళా క్రికెటర్లు..

nanireddy
Updated on: 24 Dec 2018 1:56 PM IST
పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళా క్రికెటర్లు..
X

ఇద్దరు మహిళా క్రికెటర్లు వివాహం చేసుకున్నారు. చాలా ఏళ్ల నుంచి ప్రేమికులుగా ఉన్న ఆ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్‌ జట్టుకు చెందిన కెప్టెన్‌ డేన్‌ వాన్‌ నికెర్క్, పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ మరిజాన్‌ కాప్‌ శనివారం ఒకటయ్యారు. దక్షిణాఫ్రికాలో ఇద్దరు మహిళల వివాహంపై ఎటువంటి ప్రతిబంధకాలు లేకపోవడంతో వీరి వివాహం సజావుగానే సాగింది. 2009 వరల్డ్‌ కప్‌ టోర్నీలో వీరిద్దరు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టారు. 2017–18 సంవత్సరానికి దక్షిణాఫ్రికా అత్యుత్తమ క్రికెటర్‌ అవార్డు అందుకున్న నికెర్క్, ఇప్పుడు ఆ దేశం తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతోంది.

nanireddy

nanireddy

Next Story