సౌత్ ఆఫ్రికాపై భార‌త్ ఘనవిజయం

సౌత్ ఆఫ్రికాపై భార‌త్ ఘనవిజయం
x
Highlights

సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో కోహ్లీ సేన ఘనవిజయం సాధించింది. ఛేజింగ్ వీరుడిగా పేరుగాంచిన టీం ఇండియా సారధి విరాట్ కోహ్లీ ఆ పేరుని మరోమారు...

సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో కోహ్లీ సేన ఘనవిజయం సాధించింది. ఛేజింగ్ వీరుడిగా పేరుగాంచిన టీం ఇండియా సారధి విరాట్ కోహ్లీ ఆ పేరుని మరోమారు సార్థకం చేసుకున్నాడు. ఓ వైపు టెస్టుల్లో పరాజయం, సఫారీలని సొంత గడ్డలో ఎదుర్కొనడం అంటే మామూలు విషయం కాదు. ఇలాంటి నేపథ్యంలో ఒత్తిడి మొత్తం టీం ఇండియా పైనే. కానీ ఒత్తిడి ఛాయలేవీ కనిపించకుండా కోహ్లీ అద్భుత సెంచరీతో భారత జట్టుని గెలుపు తీరాలకు చేర్చాడు. సఫారీలు భారత జట్టుకు విధించిన లక్ష్యం 270 పరుగులు.

బలమైన పేస్ అటాక్ ఉన్న సఫారీ బౌలర్లని ఎదుర్కొని ఆ లక్ష్యాన్ని సాధించడం అంత సులువేమి కాదు. ఆది నుంచే నిలకడ ప్రదర్శించన బ్యాట్స్ మాన్ లు లక్ష్యాన్ని ఛేదించారు. 45.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ ని ఛేదించారు. 119 బంతుల్లో కోహ్లీ 10 ఫోర్లతో 112 పరుగులు సాధించాడు. మరో ఎండ్ లో రహానే కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 86 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ లతో 79 పరుగులు సాధించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 269పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. సఫారీ కెప్టెన్ డూ ప్లెసిస్ కూడా అద్భుతమైన సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories