సౌమ్యని దారుణంగా హత్య చేసింది ప్రకాషే

గృహిణి సౌమ్య హత్యకేసులో మిస్టరీ వీడింది. భర్త ప్రాణ స్నేహితుడే ఈ దారుణానికి ఒడిగట్టడం సంచలనంగా...
గృహిణి సౌమ్య హత్యకేసులో మిస్టరీ వీడింది. భర్త ప్రాణ స్నేహితుడే ఈ దారుణానికి ఒడిగట్టడం సంచలనంగా మారింది. డబ్బు విషయంలో వివాదం తల్లెత్తడంతో సౌమ్య ఆమె భర్త నాగభూషణం స్నేహితుడు ప్రకాష్ హత్య చేశాడు. ఆధారాలు దొరక్కుండా మొబైల్ ఫోన్లను , హత్యకు ఉపయోగించిన మారణాయుధాలను ఫ్లష్ ట్యాంక్ లో వేయడంతో ఆధారాలు దొరకడం కష్టమైంది. అయితే ఆమె కాల్ డేటా ఆధారంగా నిందితుణ్ని గుర్తించినట్లు తెలుస్తోంది.
సౌమ్యకు విశాఖపట్నంకు చెందిన నాగభూషణంతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. ఎల్&టీలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అతను.. మంగళవారం రాత్రి 8గం. సమయంలో విధులకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ.. అర్థరాత్రి సమయంలో సౌమ్య మంటల్లో తగలబడి సజీవ దహనమైంది. అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఆమె నివసిస్తున్న ఫ్లాట్ నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో.. చుట్టుపక్కల వారు అప్రమత్తయ్యారు. వెంటనే ఇంటి తలుపులు పగలగొట్టగా.. ఒంటికి నిప్పంటుకుని మంటల్లో కాలిపోతూ కనిపించింది సౌమ్య. రెండేళ్ల కొడుకు ముందే ఈ అఘాయిత్యం జరగడం వారిని ఆశ్చర్యపరిచింది. బిందెలతో నీళ్లు తీసుకొచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ.. అప్పటికే శరీరమంతా కాలిపోవడంతో ఆమె మృతి చెందినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో భాగంగా భర్త ..ఆమె నివసిస్తున్న అపార్ట్ మెంట్ కు చెందిన వారిని విచారించారు. ఆ విచారణ కొలిక్కి రాకపోగా..పోలీసులకు ఆధారాలు లభించడం కష్టసాధ్యమైంది.
ఎట్టకేలకుసౌమ్య హత్య కేసు మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు చేధించారు. సౌమ్య భర్త నాగభూషణం స్నేహితుడైన ప్రకాష్ ఈ హత్యకు పాల్పడినట్టు గుర్తించారు. డబ్బు విషయంలో తలెత్తిన వివాదమే.. ఘర్షణకు దారి తీసి చివరకు హత్య దాకా వచ్చినట్టు ఒక అంచనాకు వచ్చారు.
ప్రకాష్, నాగభూషణం ఇద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసే చదువుకున్నారు. బీటెక్ చేసిన నాగభూషణం ఎల్&టీలో పనిచేస్తుండగా.. డిప్లోమా చదివిన ప్రకాష్ పట్నాలో పనిచేస్తున్నాడు. పట్నా నుంచి తరుచుగా హైదరాబాద్ లోని ప్రకాష్ ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఇదే క్రమంలో ఇటీవల మరోసారి ప్రకాష్ ఇంటికి వచ్చాడు.
నాగభూషణంకి మంచి స్నేహితుడు కావడం, తరుచూ ఇంటికి వచ్చి వస్తుండటంతో సౌమ్యతోనూ అతనికి సాన్నిహిత్యం ఏర్పడింది. ఏప్రిల్ 2వ తేదీ రాత్రి ప్రకాష్-నాగభూషణం ఇద్దరూ ఇంట్లోనే మద్యం సేవించారు. భోజనం చేశాక నాగభూషణం విధులకు వెళ్లగా.. ప్రకాష్ ఇంట్లోనే ఉన్నాడు. ఆ సమయంలో డబ్బు విషయమై సౌమ్య-ప్రకాష్ ల మధ్య వివాదం తలెత్తినట్టు తెలుస్తోంది.
ప్రకాష్ డబ్బు అడగడంతో సౌమ్య తిరస్కరించింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరగ్గా.. పెనుగులాటలో ఆమె తలకు బలమైన గాయమైంది. దీంతో ఆమె గట్టిగా కేకలు వేయబోగా.. భయపడిన ప్రకాష్ కత్తితో ఆమె గొంతు కోశాడు. ఆమె బతికి ఉంటే ప్రమాదమని భావించి.. నూనె పోసి నిప్పంటించి, బయట తలుపుకు గడియపెట్టి పరారయ్యాడు.
ప్రస్తుతానికి ఈ వివరాలన్నీ పోలీసులు గోప్యంగా ఉంచారు. శనివారం సాయంత్రం ఈ విషయాల్ని మీడియాకు చెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
ముంబైలో ఒక్కసారిగా కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం
19 Aug 2022 4:15 PM GMTBanana Problems: అరటిపండు అతిగా తింటే వచ్చే సమస్యలు ఇవే..!
19 Aug 2022 4:00 PM GMTకన్నీటి పర్యంతమైన 'గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ'.. డిప్యూటీ సీఎం సాయం..
19 Aug 2022 3:45 PM GMTసుకన్య సమృద్ధియోజన, పీపీఎఫ్, కిసాన్ వికాస్ పత్ర వడ్డీరేట్లు పెరిగే...
19 Aug 2022 3:30 PM GMTPM Modi: దేశంలో 10 కోట్ల ఇళ్లకు తాగునీరు..
19 Aug 2022 3:15 PM GMT