కొడుకు తప్పు చేశాడని తండ్రికి శిక్ష

x
Highlights

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. టి నర్సాపురం మండలం సాయంపాలెంలో అమానుషం చోటు చేసుకొంది. కొడుకు తప్పుచేశాడన్న కారణంతో తండ్రిని చెట్టుకు కట్టేసి...

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. టి నర్సాపురం మండలం సాయంపాలెంలో అమానుషం చోటు చేసుకొంది. కొడుకు తప్పుచేశాడన్న కారణంతో తండ్రిని చెట్టుకు కట్టేసి అవమానించారు. మనస్తాపం చెందిన తండ్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. సాయంపాలెంకు నాగేంద్ర ఓ అమ్మాయిని వేధించాడంటూ గ్రామపెద్దలు పంచాయతీ పెట్టారు.

ఈ పంచాయతీకి నాగేంద్ర రాకపోవడంతో తండ్రి సంజీవను పిలిపించి చెట్టుకు కట్టేశారు. గ్రామపెద్దలు పలువురు సంజీవపై చేయిచేసుకొన్నారు. కొడుకును క్రమశిక్షణలో పెట్టుకోవాలంటూ దుర్భాషలాడారు. అనంతరం మనస్తాపంతో ఇంటికి వెళ్లిన సంజీవ పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. అపస్మారకస్థితిలో ఉన్న సంజీవను స్థానికులు జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఏలూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories