క్యాన్సర్‌తో పోరాడుతున్న సోనాలి బింద్రే....

సోనాలీ ఫ్యాన్స్‌కు ఇది షాకింగ్ న్యూస్. నిజంగా వెరీ బ్యాడ్ న్యూస్. తన అందాలతో టాలీవుడ్, బాలీవుడ్‌ను...
సోనాలీ ఫ్యాన్స్‌కు ఇది షాకింగ్ న్యూస్. నిజంగా వెరీ బ్యాడ్ న్యూస్. తన అందాలతో టాలీవుడ్, బాలీవుడ్‌ను ఊపేసిన సోనాలి ఉన్నట్టుండి ఓ షాకింగ్ న్యూస్ బయటపెట్టింది. తాను హై గ్రేడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు సోనాలీ బింద్రే ట్విట్ చేసింది. వైద్యుల సలహా మేరకు హైగ్రేడ్ క్యాన్సర్‌కు చికిత్స చేయించుకునేందుకు న్యూయార్క్‌కు వెళ్తున్నట్లు సోనాలీ బింద్రే తన ట్విట్టర్‌లో తెలిపింది. క్యాన్సర్ చికిత్సలో ఎదురయ్యే ప్రతి సవాల్‌ను ధైర్యంగా ఎదుర్కొంటానని చెప్పింది. క్యాన్సర్ విషయం తెలియగానే కుటుంబసభ్యులు, సన్నిహతులు తనకు సపోర్ట్ చేశారని తెలిపింది. క్యాన్సర్ నుంచి తాను క్షేమంగా బయటపడాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పింది సోనాలీ బింద్రే.
ప్రేక్షకుల మనసు దోచుకున్న అందాలతార తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా ఆమె అందంతో ఆడియన్స్ ని మంత్ర ముగ్దుల్ని చేసింది. హీరోలతో పోటీపడి నటించి తనదైన గుర్తింపు తెచ్చుకుంది. తన అందం, అభినయంతో అంతులేని అభిమానాన్ని సంపాదించుకున్న హీరోయిన్ సొనాలి బింద్రె. 2001లో మహేశ్ బాబు హీరోగా నటించిన మురారి సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా సోనాలి బెంద్రే పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనస్సు దోచుకుంది. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లాంటి టాప్ హీరోల సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది.
2002లో మెగాస్టార్ చిరంజీవి సరసన ఇంద్ర సినిమాలో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది సోనాలి బెంద్రె. ఆ తర్వాత శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో మరోసారి చిరంజీవితో కలిసి నటించి లక్కీ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది. ఖడ్గం సినిమాలో చేసింది చిన్న క్యారెక్టరే అయినా సోనాలి అందానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. నాగార్జునతో కలిసి నటించిన మన్మధుడు సినిమా సోనాలి కెరీర్‌లోనే అందమైన సినిమాగా నిలిచిపోయింది. సోనాలిబెంద్రే యాక్టింగ్‌కి తెలుగు ఆడియన్స్ మంత్రముగ్దులయ్యారు. తెలుగులో సోనాలి బెంద్రె నటించిన సినిమాల్లో ఒక్క పల్నాటి బ్రహ్మనాయుడు తప్ప మిగిలిన సినిమాలన్నీ సూపర్ హిట్సే.
మురారి సినిమా కంటే ముందే తమిళ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన డబ్బింగ్ సినిమా ప్రేమికుల రోజు సినిమాతో సోనాలి బెంద్రే తెలుగు ఆడియన్స్‌కి పరిచయం అయ్యింది. మ్యూజికల్ హిట్ గా నిలిచిన ప్రేమికుల రోజు సినిమాలో సోనాలి అందమైన అభినయం ఆమెకు దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించిపెట్టింది. ప్రస్తుతం సోనాలి బెంద్రే న్యూయార్క్ లో క్యాన్సర్ వ్యాధికి చికిత్స తీసుకుంటోంది. తాను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాని సోనాలి సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో బాలివుడ్ తో పాటు టాలివుడ్ దిగ్భ్రాంతికి గురయ్యింది. సొనాలి త్వరగా కోలుకోవాలని అభిమానులు ట్విట్టర్ లో కామెంట్లు పెడుతున్నారు. బాలీవుడ్ హీరోయిన్ మనీషా కోయిరాలా, అలనాటి తెలుగు హీరోయిన్ గౌతమి, లీసారేలు క్యాన్సర్ బారిన పడ్డారు. న్యూయార్క్‌లో కఠినమైన ట్రీట్‌మెంట్ తీసుకొని క్యాన్సర్‌ను జయించారు మనీషా కోయిరాలా, గౌతమి. ప్రస్తుతం వీరిద్దరూ సినిమాలు చేసుకుంటున్నారు.
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్‌కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
ప్రభాస్ ఎలివేషన్ లపై దృష్టి పెట్టానున్న ప్రశాంత్ నీల్
28 May 2022 11:00 AM GMTMalla Reddy: ఎన్టీఆర్‌కు భారత రత్న కోసం పార్లమెంట్లో పోరాడతాం
28 May 2022 10:52 AM GMTATM PIN Number: ఏటీఎం పిన్ నెంబర్ 4 అంకెలు మాత్రమే ఎందుకు.. కారణం...
28 May 2022 10:45 AM GMTనెల్లూరు జిల్లా శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో...
28 May 2022 10:28 AM GMTరథం తరలిస్తుండగా.. విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురి మృతి
28 May 2022 10:25 AM GMT