ముంబై కోర్టు సంచలన తీర్పు

ముంబై కోర్టు సంచలన తీర్పు
x
Highlights

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సోహ్రాబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో ముంబయిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. షోహ్ర‌బుద్దీన్ షేక్...

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సోహ్రాబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో ముంబయిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. షోహ్ర‌బుద్దీన్ షేక్ ఎన్‌కౌంట‌ర్ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న 22 మంది పోలీసు ఆఫీస‌ర్లు నిర్దోషుల‌ని ఇవాళ ముంబైలోని ప్ర‌త్యేక సీబీఐ కోర్టు స్ప‌ష్టం చేసింది. షోహ్ర‌బుద్దిన్ కేసులో ఆ ఆఫీస‌ర్ల‌ను నిందించ‌డానికి స‌రైన ఆధారాలు లేవ‌ని కోర్టు వెల్ల‌డించింది. 2005, న‌వంబ‌ర్ 22న షోహ్ర‌బ్ ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. అయితే మ‌ర్డ‌ర్ జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కానీ ఆ అభియోగాన్ని నిరూపించేందుకు త‌గినంత‌గా సాక్ష్యాలు లేవ‌ని కోర్టు వెల్ల‌డించింది. షోహ్ర‌బ్‌ను మ‌ర్డ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు రుజువు చేసేందుకు త‌గిన సాక్ష్యాలు లేవ‌ని సీబీఐ జ‌డ్జి ఎస్జే శ‌ర్మ‌ త‌న తీర్పులో పేర్కొన్నారు. ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న 22 మందిలో రాజ‌స్థాన్‌, గుజ‌రాత్ జూనియ‌ర్ స్థాయి పోలీసులే ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories