సోషల్ మీడియాలో చేసే ఘోర తప్పిదమిదే..!

సోషల్ మీడియాలో చేసే ఘోర తప్పిదమిదే..!
x
Highlights

ఈ మధ్య సాధారణ మీడియాకంటె సోషల్ మీడియానే ఎక్కువ పాపులర్ అవుతుందనే భావన పలువురిలో ఉంది.. సోషల్ మీడియా అనేది కేవలం వ్యక్త్ర్హి యొక్క అభిప్రాయాన్ని , భావ...

ఈ మధ్య సాధారణ మీడియాకంటె సోషల్ మీడియానే ఎక్కువ పాపులర్ అవుతుందనే భావన పలువురిలో ఉంది.. సోషల్ మీడియా అనేది కేవలం వ్యక్త్ర్హి యొక్క అభిప్రాయాన్ని , భావ ప్రకటన స్వేచ్ఛ కోసం మాత్రమే తయారు చేశారనేది జగమెరిగిన సత్యం కానీ నేడు అది పక్కదారి పడుతుందనేది తేటతెల్లమవుతుంది.. ఈ టెక్నాలజీ యుగంలో వ్యక్తిగా తనకున్న అభిప్రాయాన్ని ఈ ప్రపంచానికి చెప్పాలనుకుంటాడు, చెప్తాడు.. అంతేకాదు ఎంతోమంది కొత్త , పాత మిత్రులను కలుసుకోవడానికి సోషల్ మీడియా అనేది ఎంతో కీలకం.. కానీ నేడు దానివల్ల యువత పక్కదారి పడుతుందనేది కొందరి విజ్ఞుల నమ్మకం, బహుశా అది నిజం కూడా అవ్వొచ్చు..

ఉదాహరణకు రాజకీయాలనే తీసుకున్నట్లయితే ఈ ప్రజాస్వామ్య యుగంలో ఎవరికి నచ్చిన పార్టీకి వారు మద్దతు తెలిపే స్వేచ్ఛ ఉంది.. అది ఎంతమాత్రం తప్పు కాదు.. కానీ ఈ క్రమంలో ఇతర వ్యక్తులను సోషల్ మీడియా వేదిక ద్వారా వ్యక్తిగతంగా విమర్శించడంలో తాను మనిషన్న విషయం కూడా మరచిపోయి ఎదుటివారిపట్ల విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు.. ఇది ఎందుకు జరుగుతుంది.. ప్రజాస్వామ్యంలో ఎవరికుండే అభిప్రాయాలూ వారికి ఉంటాయి.. అంతమాత్రాన నచ్చని వ్యక్తిని దూషించడమనేది క్షమించరాని నేరం అది కూడా సోషల్ మీడియా వేదికగా విమర్శనాస్త్రాలు సంధించడం చాల బాధాకరం..

ఎప్పుడైతే ఈ వేదికగా నువ్వు ఎదుటివారిపై మాటల దాడికి దిగుతావో అప్పుడే నిన్ను చూసి 10 మంది తయారవుతారు. అంతేకాదు పది కాస్త 100 అవుతుంది కొన్నిరోజులు వేలు కూడా అవుతుంది.. ఇలా తిట్టుకునే సంఖ్య పెంచుకోవడం నిరూపయోగమని తెలుసుకోకపోవడం అవివేకమే.. సోషల్ మీడియా అనేది పైన చెప్పినట్టు వ్యక్తి స్వేచ్చనూ ఈ ప్రపంచానికి చాటి చెప్పడానికి మాత్రమే వినియోగించుకోవాలి ఇలా కాకుండా ఎదుటివారిపై విమర్శలకు దిగడమనే చర్యలవల్ల సోషల్ మీడియా యొక్క ఆశయం దెబ్బతింటుందనేది తెలుసుకోకపోవడం జుగుప్సాకరం..

Show Full Article
Print Article
Next Story
More Stories