చచ్చిన పాము చుట్టూ చేరిన 52 పాములు..కారణం ఏంటంటే..

చచ్చిన పాము చుట్టూ చేరిన 52 పాములు..కారణం ఏంటంటే..
x
Highlights

దారిన వెళ్లేసమయాల్లో ఒక్క పాము కనిపిస్తేనే భయంతో అరకిలోమీటరు దూరం పరుగెడతాం.. అలాంటిది ఏకంగా ఓ తల్లిపాము 52 పిల్లపాములు కనిపిస్తే ఇంకేముంది.. ఒళ్ళు...

దారిన వెళ్లేసమయాల్లో ఒక్క పాము కనిపిస్తేనే భయంతో అరకిలోమీటరు దూరం పరుగెడతాం.. అలాంటిది ఏకంగా ఓ తల్లిపాము 52 పిల్లపాములు కనిపిస్తే ఇంకేముంది.. ఒళ్ళు జలదరిస్తుంది.. అలాంటి ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం తిప్పాపూర్‌లో బాల్‌రెడ్డి అనే రైతు పొలంలో చోటుచేసుకుంది. శనివారం బాల్‌రెడ్డి పొలం పనులు చేస్తుండగా పాము కనిపించింది. దీంతో భయాందోళన చెందిన బాల్‌రెడ్డి దాన్ని కర్రతో చంపేశాడు.. కొద్దిసేపటికే దాని పిల్లపాములు ఒక్కొక్కటిగా తల్లివద్దకు చేరుకున్నాయి.అవి మొత్తం 52 ఉన్నాయి. తల్లిపాము ఎంతకీ కదలకపోవడంతో అవి అక్కడక్కడే తిరగసాగాయి.. బహుశా పాముల్లో తల్లి ప్రేమ అంటే ఇదేనేమో.

Show Full Article
Print Article
Next Story
More Stories