మల్టీప్లెక్స్‌లపై వినియోగదారుల ఫోరమ్ సంచలన తీర్పు

మల్టీప్లెక్స్‌లపై వినియోగదారుల ఫోరమ్ సంచలన తీర్పు
x
Highlights

మల్టీప్లెక్స్‌ల అడ్డగోలు దందాకు చెక్‌ పెట్టేలా విజయవాడ వినియోగదారుల ఫోరం మరో కీలక నిర్ణయం తీసుకుంది. షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌లలోకి బయటి ఫుడ్...

మల్టీప్లెక్స్‌ల అడ్డగోలు దందాకు చెక్‌ పెట్టేలా విజయవాడ వినియోగదారుల ఫోరం మరో కీలక నిర్ణయం తీసుకుంది. షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌లలోకి బయటి ఫుడ్ అనుమతించాలని సంచలన తీర్పు చెప్పింది. ఈ ఆదేశాల అమలు, పర్యవేక్షణ బాధ్యత తూనికలు కొలతల శాఖకు అప్పగించింది. మల్టిప్లెక్స్‌లలో అధిక ధరలకు తినుబండారాల విక్రయంపై జిల్లా వినియోగదారుల ఫోరానికి గత ఏడాది ఏప్రిల్‌లో ఓ ఫిర్యాదు వచ్చింది. మార్గదర్శక సమితి సహకారంతో ఆ పిటిషన్ దాఖలైంది. దీనిపై వాదనలు విన్న తర్వాత వినియోగదారుల ఫోరం న్యాయమూర్తి మాధవరావు తీర్పు వెల్లడించారు. సామాన్య ప్రజలకు అర్ధమయ్యే రీతిలో తెలుగులో తీర్పు వెలువరించారు. L.E.P.L, ట్రెండ్ సెట్, PVR, PVP, ఐనాక్స్ మల్టీప్లెక్స్ థియేటర్లపై చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. తినుబండారాలు, శీతల పానియాలను అధిక ధరలకు విక్రయించియినందుకు భారీగా జరిమానా కూడా విధించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories