Top
logo

శ్రీ చైతన్య స్కూల్ బస్‌లో మంటలు

శ్రీ చైతన్య స్కూల్ బస్‌లో మంటలు
X
Highlights

మేడ్చెల్ జిల్లా యప్రాల్ కు సమీపంలో ఈసిఐల్ కు చెందిన శ్రీచైతన్య స్కూల్ బస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.ఆ...

మేడ్చెల్ జిల్లా యప్రాల్ కు సమీపంలో ఈసిఐల్ కు చెందిన శ్రీచైతన్య స్కూల్ బస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.ఆ సమయంలో బస్‌లో పది మంది వరకు విద్యార్థులు ఉన్నారు.డ్రైవర్ అప్రమత్తంగా ఉండడం వల్ల ఎటువంటి ప్రమాదం లేకుండా పిల్లలందరు బయటపడ్డారు.ఎప్పటిలాగేనే ఉదయం 7 గంటల 30 నిమిషాలకు 10 మంది విద్యార్థులతో బయలుదేరిన బస్సులో మార్గం మధ్యలో మంటలు రేగాయి.

బస్సుకు సరైనా ఫిట్‌నెస్ లేకపోవడం వల్లనే ఈ ఘటన జరిగిందని బస్సు డ్రైవర్ చెబుతున్నాడు.మంటలు రేగిన వెంటనే స్థానికుల సాయంతో విద్యార్థుల కిందకు దించేసి మంటలు ఆర్పినట్టు డ్రైవర్ నరేందర్ చెప్పాడు.ఘటన జరిగి గంటలు గడుస్తున్న స్కూల్ యాజమాన్యం ఇంతవరకు స్పందించకపోవడం పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Next Story