కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌... పార్టీలకు సింగరేణి వార్నింగ్‌

కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌... పార్టీలకు సింగరేణి వార్నింగ్‌
x
Highlights

సింగరేణి... తెలంగాణలో చాలా కీలకమైన ప్రాంతం. రాజకీయాలను చాలE వరకు శాసిస్తుంది. అందుకే ఇప్పుడు ఈ ప్రాంతంలో పోటీ చేసే అభ్యర్థులు కార్మికుల ఓట్ల కోసం...

సింగరేణి... తెలంగాణలో చాలా కీలకమైన ప్రాంతం. రాజకీయాలను చాలE వరకు శాసిస్తుంది. అందుకే ఇప్పుడు ఈ ప్రాంతంలో పోటీ చేసే అభ్యర్థులు కార్మికుల ఓట్ల కోసం పడరని పాట్లు పడుతున్నారు. సింగరేణి మాత్రం తమ పనులకు అడ్డం రాకండంటూ పార్టీలకు నోటీసులు ఇచ్చింది. గనుల్లో ప్రచారం నిర్వహించొద్దని తెగేసి చెప్పింది. కోల్‌బెల్ట్ ఏరియాలో ఎలాంటి ఎన్నికలు జరిగిన ఆ ప్రభావం కచ్చింతంగా పెద్దగానే ఉంటుంది. రాష్ట్ర ఎన్నికలైనా లేక సింగరేణి అంతర్గత ఎన్నికలైనా... ఇష్యూ ఏదైనా హాట్‌హాట్‌గానే ఉంటుంది. సింగరేణి కార్మికుల ఓట్లే కీలకంగానూ ఉంటాయి. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు కూడా అదే పరిస్థితి. కార్మికులను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని ప్రధాన పార్టీలు తమ ప్రయత్నాలు చేస్తున్నాయి. కార్మికులను తమ వర్క్ ఏరియాలోనే కలుస్తున్నారు. దీంతో సింగరేణి కూడా ఈ ఎన్నికల ప్రచారానికి బ్రేకులు వేసింది. సింగరేణిలో తమ పనులకు ప్రచారం ఇబ్బందిగా మారడంతో వర్క్ ఏరియాలో ప్రచారం చేయోద్దంటు నోటిసులు జారీ చేసింది.

మరోవైపు ఉత్తర తెలంగాణలో సింగరేణి సంస్థ విస్తరించి ఉన్న 10 నియోజకవర్గాల పరిధిలో కార్మికుల ఓట్లే కీలకం. ఈ ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు కార్మికలు మద్దతు గనుల వైపు క్యూ కడుతుంటారు. ఒక్క గనిపై కార్మికులు అంతా కలిసి పలాన పార్టీకి ఓటెయ్యలని నిర్ణయం తీసుకుంటే...తెలియకుండానే ఆ ప్రభావం సింగరేణి ప్రాంతం అంత చూపుతుంది. కోల్‌బెల్ట్ ఏరియాల్లో మెజారిటి కార్మికులు ఎటు వైపు మొగ్గు చూపితే ఆ పార్టీ మొత్తం సింగరేణి గడ్డపై అధిక స్థానాల్లో విజయం సాధించేవి . దీంతో సింగరేణి పరిధిలో ఉన్న10 స్థానాల్లో విజయం సాధించిన అభ్యర్థులే ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా పాత్ర పోషిస్తూ వస్తున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రామగుండం, మంథని నియోజకవర్గాల్లో సింగరేని కార్మికుల ఓటు బ్యాంకుపైనే పార్టీలు ఆధారపడ్డాయి. వీరి ఓట్ల కోసం రామగుండం నియెజకవర్గం పరిధిలో టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారయణ, కోరుకంటి చందర్‌లతో పాటు మంథని నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధు, కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి శ్రీధర్‌బాబు కార్మికుల ఓట్ల కోసం బొగ్గు గనుల బాట పట్టారు. ప్రతి రోజు ఏదో ఒక గనిని ఎంచుకొని ఉదయన్నే ప్రచారాన్ని నిర్వహించాకే... నియోజకవర్గ పర్యనకు వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే సింగరేణి యాజమాన్యం అన్ని పార్టీలకు సర్యూలర్‌ జారీ చేసింది. సింగరేణి ప్రభుత్వ సంస్థ అవడంతో ఇక్కడ ప్రచారం కాని, సభలు, సమావేశాలు కానీ నిర్వహిస్తే కోడ్ అఫ్ కండక్ట్ కిందకి వస్తుందంటు హెచ్చరించింది. ఇటు సింగరేణి ఉద్యోగులకు కూడా యాజమాన్యం పరిధి దాటి ప్రచారంలో పాల్గొనవద్దంటూ నోటీసులు ఇచ్చింది. దీంతో గనులపై పార్టీల ప్రచారానికి బ్రేక్ పడింది.. మరి ఈ పరిస్థితుల్లో ఉద్యోగులు కార్మికులు ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories