logo
సినిమా

డిసెంబర్ 13న శ్వేతా పెళ్లి..!

డిసెంబర్ 13న శ్వేతా పెళ్లి..!
X
Highlights

తొలి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గుర్తింపు తెచ్చుకున్న శ్వేతా బసు ప్రసాద్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతోంది....

తొలి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గుర్తింపు తెచ్చుకున్న శ్వేతా బసు ప్రసాద్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతోంది. ఫిల్మ్‌మేకర్‌ రోహిత్‌ మిట్టల్‌ తో శ్వేతా ఏడడుగులు వేయబోతోంది. డిసెంబరు 13న పుణెలో వీరి వివాహ వేడుక జరగనున్నట్లు సమాచారం. మార్వాడీ, బెంగాలీ రెండు సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరగనుంది. ప్రస్తుతం శ్వేత తన కాబోయే భర్త, స్నేహితులతో కలిసి ఇండోనేషియా, బాలీలో బ్యాచిలర్‌ పార్టీని ఎంజాయ్‌ చేస్తున్నారు. ఆ సందర్భంగా దిగిన ఫొటోలను శ్వేతా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. కొత్తబంగారు లోకం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్వేతా ఆ తర్వాత అడపా దడపా తెలుగు చిత్రాల్లో నటించారు. కానీ ఇటీవల కొద్దికాలంనుంచి ఆమె పూర్తిగా ముంబైకే పరిమితమయ్యారు. ప్రస్తుతం పలు టీవీ సీరియల్లో నటిస్తూ బిజీగా ఉంది.

Next Story